వైద్యులకు ప్రధాని హితవు
. డబ్బు మీద కాదు.. జబ్బు మీద దృష్టిపెట్టండి
న్యూఢిల్లీ,సెప్టెంబర్11 (జనంసాక్షి):
వైద్యులు రోగం విూద కాకుండా.. రోగుల విూద శ్రద్ధ పెట్టినప్పుడే పూర్తి విజయం సాధించగలరని ప్రధాని నర్రేంద్రమోదీ అన్నారు. సాధారణ ప్రజలు వైద్యులను దేవుడిగా చూస్తారని ఆయన అన్నారు. డాక్టర్లు యంత్రాలు కారన్నారు. తెలివి తేటలు ఒక్కటే ఉంటే సరిపోదని.. ప్రతి వైద్యుడు రోగితో ఒక అనుబంధం ఏర్పరుచుకోవాలని సూచించారు. ఆయన చండీఘర్‌లోని ‘పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్'( పీజీఐఎంఈఆర్) స్నాతకోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వైద్యులను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందిందని.. రోగి ప్రాణాలు కాపాడేందుకు అది వైద్యులకు ఎంతోగానో సహాయపడుతుందని మోదీ పేర్కొన్నారు. మందులకు దూరంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని.. అనారోగ్యం నుంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నారని ఆయన చెప్పారు. అందుకు యోగా సహాయపడుతుందని సూచించారు. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడానికి 177 దేశాలు మద్దతుగా నిలిచాయని ఈ సందర్భంగా మోదీ గుర్తు చేశారు. చంపడం చాలా సులభమని.. కానీ ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడటం చాలా ముఖ్యమని… ఆ పని వైద్యులు చేస్తున్నారన్న మోదీ వారిని అభినందించారు. ఈ కాన్వొకేషన్ వైద్యుల జీవితాల్లో కొత్త మలుపునకు శ్రీకారం చుడుతుందని, ఇకనుంచి వారు పేదల కోసం తమ వృత్తి నైపుణ్యాలను ఉపయోగించాలని కోరారు.