వైద్య సిబ్బంది గ్రామాలకు తరలాలి : కలెక్టర్‌

ఏలూరు,ఆగస్ట్‌28 (జనంసాక్షి): ఈ వర్షాకాలం ప్రారంభమైన తరవాత మళ్లీ ఇటీవలి వరదలతో జిల్లాలో అనేక చోట్ల అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టారు. ఆయా గ్రామాల్లో అంటువ్యాధులతో అప్రమత్తంగా ఉండాలిన  కలెక్టర్‌ ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా గ్రామాల్లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. తగిన మందులను వెంట ఉంచుకోవాలన్నారు. వానాకాలంలో ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాల్లో తగు చర్యలు చేపట్టాలని వైద్యాధికారులను ఆదేశించారు. జిల్లాలో  ప్రత్యేక వైద్యాధికారులుగా నియమించి గ్రామాల్లో వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. దీనికి అవసరమైన వ్యాక్సిన్‌ను ముందుగానే సిద్ధం చేసుకోవాలని చెప్పారు. నరసాపురం, భీమవరం, బుట్టాయిగూడెంలో ఆరోగ్య కేంద్రాలను త్వరగా ప్రారంభించేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు.  జిల్లాలో టీబీ కేసులను తగ్గించేందుకు తగు చర్యలు చేపట్టాలని, క్షయ వ్యాధిగ్రస్తులకు అవసరమైన మందులను క్రమం తప్పకుండా పంపిణీ చేయాలన్నారు. కుష్టువ్యాధి నివారణ కోసం చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు.