వైఫల్యాలపై టిఆర్‌ఎస్ కళ్లు తెరవాలి : డిసిసి
నిజామాబాద్,జూన్2(జనం సాక్షి): తెరాస ప్రభుత్వ వైఫల్యాలను ప్రతీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గ్రామాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలని కాంగ్రెస్ జిల్లా పార్టీ అధ్యక్షులు తాహెర్‌బిన్‌హందాన్ అన్నారు.సంబమరాలు జరుపుకోవడంమినహా ఏ ఒక్క హావిూ నెరవేరలేదన్నారు. ఎన్నికల్లో రెండు పడకల ఇళ్లు, దళితులకు మూడు ఎకరాల వ్యవసాయభూమి, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య తదితర హావిూలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించారని వీటిపై పోరాడాలన్నారు. నాలుగేళ్ల పాలనలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలకు ఎలాంటి మేలూ కలగలేదనే అంశాన్ని రాష్ట్రమంతటా చాటేందుకే పిసిసి బస్సు యాత్ర చేస్తోందని అన్నారు. ఆంధ్ర ప్రాంతంలో అధికారం కోల్పోతున్నామని తెలిసినా ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించి, చలించి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. కానీ టీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ సమాజానికి ఏ మేలూ జరగలేదు. విభజన బిల్లులోని ఏ హావిూ అమలుకు నోచలేదన్నారు. దీనికి టిఆర్‌ఎస్ నేతలు సమాధానం ఇవ్వాలన్నారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియానే టిఆర్‌ఎస్ విస్మరించిందన్నారు. ప్రతీ కాంగ్రెస్ కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని, భయం లేకుండా ధైర్యంగా ముందుకు సాగాలని నిరంతరం ప్రజా సమస్యలపై గళం విప్పాలని చెప్పారు. రాష్ట్రంలో ఫ్యూడల్ పాలన కొనసాగుతుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వారికి గుర్తింపు లేకుండా పోయిందన్నారు.
—————————