వైభవంగా కళ్యాణం..
అశ్వవాహనంపై స్వామి వారి ఊరేగింపు
ముగిసిన ఆలయ వార్షికోత్సవ వేడుకలు
పాల్గొన్న ఎమ్మెల్యే, డీసీసీబీ చైర్మన్
పరిగి రూరల్, అక్టోబర్ 17, ( జనం సాక్షి ):
వికారాబాద్ జిల్లా పరిగిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ప్రథమ వార్షికోత్సవంలో మూడోరోజు స్వామి వారి కళ్యాణ మహోత్సవ వేడుకలు,అనంతరం ఊరేగింపు కన్నుల పండుగగా జరిగాయి. వేద పండింతులు, పురోహితులు బ్రహ్మ శ్రీ కొడకండ్ల శ్రీ రామ్ శరణ్ శర్మ, సిద్దాంతి పార్థ సారథి మంత్రోత్సవాలు, బాజాబజంత్రీలు, మేళ తాళాల మద్య శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి ఆలయ ధర్మకర్త దంపతులు ఎదిరె మాణెమ్మ–సత్యనారాయణ, ఎదిరె పద్మ–కృష్ణ, ఎదిరె జయ – నరేందర్ తోపాటు మరి కొందరుతు దంపతులు యజ్ఞం, కుంకుమార్చన నిర్వహించారు. వేలాదిగా వచ్చిన భక్తుల మద్యన స్వామి పూజా కార్యక్రమాలన్నీ కన్నుల పండుగగా జరిగాయి. ఉదయం నుంచి రాత్రి వరకు మూడు రోజులపాటు పరిగిలో పండుగ వాతావరణం నెలకొంది. పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి పూర్ణకుంభం యజ్ఞంలో వేశారు. అనంతరం స్వామి వారి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంతో డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి, పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్,జెడ్పీటీసీ బేతు హరిప్రియ, మార్కెట్ కమిటీ చైర్మన్ అంతిగారి సురేందర్ కుమార్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ శివన్నళ్ల భాస్కర్, పార్టీల కతీతంగా నాయకులు,కార్యకర్తలు భక్తులు పెద్ద సంఖ్యలో కళ్యాణ మహోత్సవానికి హాజరయ్యారు. అశ్వ వాహనంపై శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని వైభవోపేతంగా ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపు మందులు మహిళలు కోలాటం, జజన చేస్తూ భక్తతో పరవశించారు.
ఫోటో రైటప్ :
17 పిఆర్ జి 03లో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి మొక్కులు సమర్పించుకుంటున్న ఎమ్మెల్యే తదితరులు
04లో కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి,కౌన్సిలర్ కృష్ణ
04లో అశ్వవాహనం పై ఊరేగుతున్న స్వామి వారి ముందు ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి తదితరులు
05లో స్వామి వారి ఊరేగింపు ముందు కోలాటమాడుతున్న మహిళలు