వ్యవసాయరంగంలో కొత్త ఒరవడులకు ప్రోత్సాహం: పోచారం
హైదరాబాద్: రాజేంద్రనగర్ నార్మ్ ప్రాంగణంలో వ్యవసాయ నైపుణ్యాలపై దక్షిణాది రాష్ర్టాల సదస్సు జరుగుతోంది. ముఖ్య అతిథిగా వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. కేంద్ర వ్యవసాయ శాఖ అదనపు కార్యదర్శ రాఘవేంద్రసింగ్, మేనేజ్ డీజీ ఉషారాణి సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పోచారం మాట్లాడుతూ… వ్యవసాయరంగం బలోపేతం దృష్ట్యా కొత్త ఒరవడులకు ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. పెట్టుబడులు తగ్గించి నికర లాభాలు పెంచాలన్నదే కేంద్ర రాష్ర్టాల ధ్యేయం. రాష్ట్రంలో రైతు రుణమాఫీ సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు.