వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలి

సిద్దిపేట,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చుకుంటేనే అధిక లాభాలను పొందడానికి అవకాశం ఉంటుందని టిఆర్‌ఎస్‌ నాయకుడు ఎలక్షన్‌ రెడ్డి సూచించారు. సిఎం కెసిఆర్‌ వ్యవసాయానికి భారీ ప్రోత్సాహకాలు ఇస్తున్నారని, వాటిని ఉపయోగించుకుని రైతులు లాభాలు పండించ వచ్చన్నారు. రైతులు సమష్టిగా కృషిచేయడానికి ప్రయత్నించాలని కోరారు. దేశానికి వెన్నుముక రైతేనని ఆయన బాగుంటే దేశం బాగుంటుందన్నారు. రైతులు ఆధునిక సేద్య పద్ధతులను ఎప్పటికప్పుడు తెలుసుకుని ముందుకు సాగితేనే మంచి దిగుబడులు వస్తాయని పేర్కొన్నారు. గ్రావిూణ ప్రాంతాలకు చెందిన యువ కర్షకులకు ఉచితంగా ఇస్తున్న శిక్షణను వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిక్షణ పొందిన కర్షకులు వ్యవసాయ రంగంలో లాభాలు గడించాలన్నారు. విత్తన భాండాగారం కావాలని సిఎం కెసిఆర్‌ తలపెట్టిన ఆలోచనకు కార్యరూపం ఇవ్వాలని అన్నారు. వ్యవసాయంలో యువకులకు ఇస్తున్న శిక్షణ వారి భవిష్యత్తుకు మేలు చేస్తుందని అన్నారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని ఉత్పాదకతను పెంచాలని సూచించారు. దేశంలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఉందని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని ఆయన సూచించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి శిక్షణ దోహదపడుతుందని తెలిపారు.

తాజావార్తలు