వ్యవసాయ ఆధారిత పరిశ్రమలదే భవిష్యత్
రైతుకు గిట్టుబాటు ధర లభించేందుకు ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నది
తెలంగాణ వ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు పది వేల ఎకరాలను కేటాయించింది
రైతుబంధు, రైతుభీమా, రుణమాఫీ, ఉచిత కరంటు, సాగునీళ్లు అందించి వంద శాతం పంటల కొనుగోళ్లు చేసి రైతుకు అండగా నిలుస్తున్నది
దేశ చరిత్రలో రెండు సార్లు రుణమాఫీ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ
సకాలంలో రైతులకు ఇబ్బంది కలగకుండా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచుతున్నది
సాంప్రదాయ వ్యవసాయం, సాంప్రదాయ పంటల నుండి రైతులను బయటకు తీసుకువచ్చేందుకు పంటల మార్పిడి వైపు నడిపిస్తున్నది
తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహం మూలంగా ఆయిల్ పామ్ సాగులో దేశంలో తెలంగాణ ద్వితీయ స్థానంలో నిలిచింది .. మరో ఏడాదిలో ప్రథమస్థానంలో నిలవనున్నది
ప్రభుత్వ చర్యల మూలంగా తెలంగాణ రైతు ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నాడు
భవిష్యత్ లో తెలంగాణ రైతు దేశానికి ఆదర్శంగా నిలవబోతున్నాడు
కేసీఆర్ వ్యవసాయ అనుకూల విధానాలు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి
పెబ్బేరు మండలకేంద్రంలో శ్రీ సాయి రైస్ ఇండస్ట్రీని ప్రారంభించిన అనంతరం పెబ్బేరు చెలిమిల్ల 5వ వార్డు నుండి బీజేపీని వీడి మున్సిపల్ చైర్మన్ ఎద్దుల కరుణశ్రీ సాయినాథ్, కౌన్సిలర్ గోపిబాబు ఆధ్వర్యంలో
బీఅర్ఎస్ లో చేరిన 100 మంది .. కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, పెబ్బేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గౌని బుచ్చరెడ్డి తదితరులు పాల్గొన్నారు