వ్యవసాయ కళాశాల విద్యార్థికి బంగారు పతకం
అశ్వారావుపేట: దేశ వ్యాప్తంగా అంతర్ విశ్వవిద్యాలయాల ఆధ్వర్యంలో కర్నాటక రాష్ట్రం బీదర్‌లో ఈ నెల 6నుంచి 10వ తేదీ వరకు జరిగిన క్రీడా పోటీల్లో ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాయానికి ఒక బంగారు పతకం, 3వెండి పతకాలు దక్కాయి. వాటిలో అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల విద్యార్థి జగదీష్ కు 100 మీ పరుగు పందెంలో బంగారు పతకం, 200 మీటర్ల పరుగు పందెంలో వెండి పతకం, ట్రిపుల్ పరుగు పందెంలో మరో వెండి పతకం వచ్చాయి. పతకాలు సాధించినందుకు కళాశాలలో బోధన సిబ్బంది. బోధనేతర సిబ్బంది జగదీష్‌కు శుభాకాంక్షలు తెలిపారు.