వ్యవసాయ కళాశాల విద్యార్థుల నిరాహార దీక్షలు
అశ్వారావుపేట: సమస్యల పరిష్కారం కోరుతూ అశ్వారావు పేటలో వ్యవసాయ కళాశాల విద్యార్థులు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. వ్యవసాయ కళాశాలలో ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోరుతూ 150 మంది విద్యార్థినీ విద్యార్థులు సోమవారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. కళాశాల ప్రధాన ద్వారాలకు తాళాలు వేయటంతో బోధన, బోధనేతర సిబ్బంది కళాశాల బయటే ఉండాల్సి వచ్చింది. దీక్ష విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని కళాశాల అసోసియేట్ డీన్ గోవిందరావు తెలిపారు.