వ్యవసాయ కార్మిక సంఘం మహాసభ
అశ్వారావుపేట: ఉపాధిహామీ కూలీలకు కొలతలతో సంబంధం లేకుండా రోజుకు రూ.300 ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం మహాసభ డిమాండ్ చేసింది. బుధవారం అశారావుపేట వ్యవసాయ కార్మిక సంఘం 5వ మహాసభ చిరంజీవి అధ్వక్షతన జరిగింది. ఈ సమావేశంలో నాయకులు పలు తీర్మానాలు ఆమోదించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘ జిల్లా నాయకులు పుల్లయ్య, గంగారాజు, తదితరులు ప్రసంగించారు.