వ్యవసాయ చట్టాలపై అవగాహన కల్పించడంలో విఫలం

బిజెపి నేత ఉమాభారతి విమర్శలు

భోపాల్‌,నవంబర్‌ 23(జనంసాక్షి):  వ్యవసాయచట్టాలను రైతులకు సమగ్రంగా వివరించడంలో బిజెపి నేతలదే వైఫల్యం అని బీజేపీ సీనియర్‌ నాయకురాలు ఉమా భారతి అన్నారు. వారికి చట్టాల లక్ష్యాలను స్పస్టంగా అవగాహనచేయించి ఉంటే ఇలా జరిగేది కాదన్నారు. వ్యవసాయ చట్టాల రద్దుపై బీజేపీ సీనియర్‌ నాయకురాలు ఉమా భారతి స్పందించారు. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నట్టు ప్రధాని మోదీ చేసిన ప్రకటన తనను కలచివేసిందని ఆమె పేర్కొన్నారు. భారతదేశంలోని రైతులు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ నిర్ణయాలతో కానీ, కృషితో కానీ సంతృప్తి చెందలేదన్నారు. వ్యవసాయ చట్టాలను రైతులకు సమగ్రంగా వివరించడంలో బీజేపీ నాయకులు విఫలమయ్యారని చెప్పారు. రైతులకు సరైన పద్ధతిలో ఎందుకు వివరించలేకపోయారని ప్రశ్నించారు. ఈ చట్టాల విషయంలో విపక్షాలను ఎదుర్కొలేక పోయామని పేర్కొన్నారు. వ్యవసాయ చట్టాల ఉపసంహరణ తనకు నచ్చలేదని, అందుకే మూడు రోజుల తర్వాత స్పందిస్తున్నానని తెలిపారు. మోదీ ఆ ప్రకటన చేసిన సమయంలో వారణాసిలో గంగానది ఒడ్డున ఉన్నట్టు పేర్కొన్నారు.