వ్యాక్సిన్ వచ్చే వరకు అప్రమత్తత అవసరం
స్వైన్ ఫ్లూ కంటే పదిరెట్లు ప్రమాదకారి కరోనా వైరస్ ప్రపంచదేశాలకు డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక
జెనీవా, ఏప్రిల్ 13(జనంసాక్షి): ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ముప్పునుంచి మానవాళి బయటపడే అవకా శాలు ఇప్పట్లో లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అభిప్రాయపడింది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకూ ఈ వైరస్ ముప్పు పొంచివుందని డబ్ల్యూ హెచ్ఓ అధికార ప్రతినిధి డా.డేవిడ్ నాబర్రో అంచనా వేశారు. వైరసకు విరుగుడు (వ్యాక్సిన్) వచ్చేంతవరకూ ఈ వైరస్ మనల్ని వెంటాడే అవకాశాలు కనిపిస్తు న్నాయని తాజాగా విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. కొంతకాలం పాటు తగ్గినట్లు కనిపించినప్పటికీ.. మళ్లీ తిరిగి విజృంభించే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ సమయంలో వైరసను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ, లక్షణాలున్న వారిని వెంటనే ఐసోలేట్ చేసే పద్ధతి కొనసాగిస్తూనే ఉండాలని సూచించారు. దీనికి ప్రపంచ దేశా లు సన్నద్ధంగా ఉండాలని అప్రమత్తం చేశారు.మరికొన్ని రోజుల్లో వైరస్ ప్రభావం తగ్గుతుందని అమెరికాతోపాటు ఇతర దేశాలు డేవిడ్ చేసిన హెచ్చరికలు ప్రాధాన్యం అంచనా వేస్తున్న నేపథ్యంలో సంతరించుకున్నాయి. ఇంటికే పరిమితం కావాలని విధించిన ఆంక్షలు సడలిస్తామని చేస్తున్న ప్రకటనలపై ఆయాదేశాలు పునరాలోచించుకోవాలని సూచించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులు నిలిపివేస్తామన్న ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ అధికార ప్రతినిధి స్పందించారు. అమెరికాతో తమ భాగస్వామ్యం కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ అదే జరిగితే చాలా దురదృష్టకరం అని డేవిడ్ నాబి అభిప్రాయపడ్డారు. కాగా ప్రతి సంవత్సరం అమెరికా 500మిలియన్ డాలర్ల నిధులను ప్రపంచ ఆరోగ్య సంస్థకు సమకూరుస్తోంది. ఇదిలా ఉంటే, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 18లక్షల మందికి సోకిన కరోనా వైరస్ కారణంగా లక్షా పదివేల మంది మృత్యువాతపడ్డారు. కేవలం అమెరికాలోనే 20వేల మంది చనిపోగా మరో ఐదు లక్షలకు పైగా అమెరికన్లు ఈవైరస్ బారిన పడ్డారు. స్వైన్ ఫ్లూ కంటే పదిరెట్లు ప్రమాదకారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ స్వైన్ ఫ్లూ కంటే పది రెట్లు ప్రమాదకారి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ప్రకటించింది. కరోనా వైరస్ ఎంతో ప్రమాదకారి అని, వేగంగా వ్యాప్తి చెందుతుందని మనందరికీ తెలుసు. అయితే, ఇది స్వైన్ ఫ్లూ కంటే పదిరెట్లు వేగంగా వ్యాపిస్తుందని, జనసమ్మర్థం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఇది మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందని డబ్ల్యూహెచ్ వో వెల్లడించింది. ఈ వైరస్ సోకిన వారిని నిర్భందంలో ఉంచడం ఎంతో ముఖ్యమని సూచించింది. వైరస్ బాధితులకు సన్నిహితంగా ఉన్న వారిని గుర్తించడం సవాలుతో కూడుకున్న పని అని డబ్ల్యూహెవో చీఫ్ టెట్రోస్ అధానోమ్ తెలిపారు. లా డౌన్ నిబంధనలను సడలించాలని ప్రపంచ దేశాలను యునైటెడ్ నేషన్స్ ఆరోగ్య సంస్థ కోరిన నేపథ్యంలో తాజాగా డబ్ల్యూహెచ్ వో చేసిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకొంది. “మనకు ఏం తెలుసో అది మాత్రమే చెప్తాం. మనకు తెలిసిన దాని గురించే పని చేయగలం. వైరస్ ఎలా ప్రవర్తిస్తుంది, దాని తీవ్రత ఎలా ఉంటుంది, దాన్ని ఎలా ఎదుర్కొవాలనే అనేదానికి ఇప్పటికే పలు దేశాలు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచాయి. అలానే కొన్ని దేశాల్లో ప్రతి మూడు నాలుగు రోజులకు కరోనా కేసుల సంఖ్య రెట్టింపు అవుతోంది. అయితే, వైరస్ ఎంత వేగంగా వ్యాపిస్తుందో అంత నెమ్మదిగా తగ్గు ముఖం పట్టే అవకాశం ఉంది.” అని టెర్రస్ అన్నారు.