వ్యాపమ్ స్కామ్‌లో ఆగని మరణ మృదంగం
– తాజాగా వైద్యుడి మృతి
– విలేకరి మృతిపై దర్యాప్తు
దిల్లీ/ భోపాల్,జులై5(జనంసాక్షి): మధ్యప్రదేశ్ సాంకేతిక విద్యామండలిలో నియామకాలు, ప్రవేశాల భారీ అక్రమాల వ్యవహారంలో (వ్యాపం కుంభకోణంలో) మరో అనుమానాస్పద మరణం చోటు చేసుకొంది. కేసుతో సంబంధం ఉన్నవారు ఒక్కొరొక్కరుగా ప్రాణాలు కోల్పోతున్న తీరుపై ఆందోళన పెరుగుతోంది. ఈ రహస్యాన్ని ా’ాదించడానికి సీబీఐ విచారణే మార్గమని విపక్షాలు గట్టిగా చెబుతున్నాయి. కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న వైద్యుడొకరు దిల్లీలోని ¬టల్ గదిలో ఆదివారం శవమై కనిపించారు. ఈ కుంభకోణంపై కథనం ఇచ్చేందుకు వెళ్లి, ఒక టీవీ ఛానెల్‌కు చెందిన పరిశోధనాత్మక విలేకరి ప్రాణాలు కోల్పోయిన 48 గంటల్లోనే ఈ ఘటన వెలుగుచూసింది. జబల్పూర్‌లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ వైద్య కళాశాలలో డీన్‌గా ఉన్న డాక్టర్ అరుణ్‌శర్మ (64) నైరుతి దిల్లీలోని ఓ ¬టల్లో బస చేశారు. ఎన్నిసార్లు తలుపుకొట్టినా తీయకపోవడంతో సిబ్బంది మారుతా’ళాలతో తలుపులు తెరిచేసరికి ఆయన మృతిచెంది ఉన్నారు. ఖాళీ మద్యం సీసా, వాంతి చేసుకున్న ఆనవాళ్లు అక్కడ కనిపించాయి. న్యాయవైజ్ఞానిక పరిశోధన విభాగం బృందం కొన్ని సాక్ష్యాధారాలను సేకరించింది. మృతదేహాన్ని శవపరీక్షకు తరలించారు. శర్మకు ముందు డీన్‌గా వ్యవహరించిన వైద్యుడూ తన ఇంట్లోనే ౖకాలిపోయి’ ప్రాణాలు వదిలారు..!
నివేదిక ఇచ్చిన రెండ్రోజుల్లోనే…
ప్రత్యేక కార్యద’ళానికి దర్యాప్తు నివేదిక ఇచ్చిన రెండ్రోజుల్లోనే శర్మ చనిపోవడం చూస్తే ఇది హత్యేనని అనుమానించాల్సి వస్తోందని భారత వైద్యుల సంఘం (ఐ.ఎం.ఎ.) జబల్పూర్ శాఖాధ్యక్షుడు సుధీర్ తివారీ ఆరోపించారు. విలేకరి అక్షయ్‌సింగ్ (38) ప్రాణాలు కోల్పోవడంపై క్షుణ్నంగా దర్యాప్తు చేయాల్సిందిగా వ్యాపం కుంభకోణంపై విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)నే కోరనున్నట్లు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ ాహాన్ విలేకరులకు తెలిపారు. సీబీఐ సహా ఏ దర్యాప్తు సంస్థద్వారానైనా విచారణ జరిపించాలని హైకోర్టు ఆదేశిస్తే తమకెలాంటి అభ్యంతరం ఉండబోదని స్పష్టం చేశారు. మరణాలపై దర్యాప్తు జరిపించాల్సిందిగా గతంలోనే హైకోర్టును కోరామనీ, మరోసారి లేఖ రాస్తామనీ తెలిపారు. వ్యాపం కుంభకోణానికి సంబంధించిన 23 అసహజ, అనుమానాస్పద మరణాలు చోటు చేసుకున్నాయని హైకోర్టుకు సమర్పించిన నివేదికలో సిట్ పేర్కొంది. ఆ నివేదిక తర్వాతా రెండ్రోజుల వ్యవధిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
నిష్పాక్షికంగా విచారణ: జైట్లీ
మరణాలపై అనుమానాలను తీర్చేరీతిలో అత్యంత నిష్పాక్షికంగా విచారణ జరిపిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. వరస మరణాలపై ప్రధాని నరేంద్రమోదీ ఎందుకు స్పందించడం లేదని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో జైట్లీ ఈ మేరకు ట్వీట్ చేశారు. విలేకరి అక్షయ్‌సింగ్‌కు ఆదివారం దిల్లీలో అంత్యక్రియలు జరిగాయి. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి సిసోడియా, దిల్లీ భాజపా అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ, దిల్లీ పీసీసీ అధ్యక్షుడు అజయ్‌మాకెన్, కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్‌సింగ్, రణదీప్‌సింగ్ సూర్జేవాలా హాజరయ్యారు. అత్యంత బాధాకర పరిస్థితిల్లో విలేకరి తల్లిదండ్రుల్ని, సోదరిని కలిశానని రాహుల్‌గాంధీ ట్వీట్ చేశారు. మరిన్ని మరణాలు చోటుచేసుకోకుండా ఏదోఒకటి చేయాలనీ, నిందితులపై చర్యలు తీసుకోవాలనీ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. తాజా ఘటన నేపథ్యంలోనైనా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ ద్వారా విచారణ జరిపించాలని కాంగ్రెస్ మరోసారి డిమాండ్ చేసింది. గుర్తు తెలియని కారణాలతో ఏకంగా 45 మంది చనిపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా పేర్కొన్నారు. సిట్ దర్యాప్తు పేలవంగా ఉందన్నారు. ౖఇండియాటుడే గ్రూపు’ వినతిపై విలేకరి అక్షయ్ ఉదరభాగం నుంచి కొన్ని నమూనాలను పరీక్ష నిమిత్తం దిల్లీలోని ఎయిమ్స్‌కు పంపించడానికి మధ్యప్రదేశ్ సీఎం ాహాన్ అంగీకరించారు. కేంద్ర ¬ం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం ాహాన్‌తో 10 నిమిషాలు మాట్లాడి విలేకరి మరణంపై విచారణ జరిపించాలని చెప్పారు. కేసుతో సంబంధం ఉన్నవారందరికీ రక్షణ లభించేలా చూడాలని చెప్పారు. నిష్పాక్షిక విచారణ జరిగేలా చూడాలని ప్రసార సంపాదకుల సంఘం (బి.ఇ.ఎ.) విజ్ఞప్తి చేసింది.