వ్యాపారం చేస్తూ వచ్చే లాభాలతో సమాజాభివృద్దికి తోడ్పడుతున్న సంస్థ ఎల్‌ఐసి
-17లక్షల 32వేల కోట్ల సొమ్మును ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు
-ఏ బ్యాంకు ఇవ్వని విదంగా 8శాతం వడ్డీని పెన్షన్‌గా ఇస్తున్నాం
-ప్రదానమంత్రి వయో వందన కార్యక్రమంలో వృద్దులకు చేయూత
-ఎల్‌ఐసి 61వ ఆవిర్బావసందర్బంగా విూడియా సమావేశంలో సీనియర్ డివిజనల్ మేనేజర్ వెంకటేశ్వర్లు
కరీంనగర్, సెప్టెంబర్ 1 (జనంసాక్షి:కేవలం 5 కోట్ల ప్రభుత్వ దనం పెట్టుబడితో ప్రారంభమైన జీవిత భీమాసంస్థ నేడు 25లక్షల 42వేల కోట్లకు పెరిగిందని కరీంనగర్ సీనియర్ డివిజనల్ మేనేజర్ వై
వెంకటేశ్వర్లు వెల్లడించారు. శుక్రవారం సెప్టెంబర్ 1 వతేదీ ఎల్‌ఐసి 61 వ ఆవిర్బావ దినోత్సవం సందర్బంగా డివిజనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 29 కోట్ల పాలసీలు నేడు ఫోర్స్‌లో ఉన్నాయన్నారు. సంస్థ ఆద్వర్యంలో మార్చి కి ముందు 24 రకాల పాలసీలుండగా మార్చి తర్వాత మూడు కొత్త పాలసీలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఆదార్ థంబ్ పేరుతొ ఆడవారికి ఆదార్ శిలా పేరుతో పురుషులకు ప్రత్యేకంగా పాలసీలను ప్రారంభించామన్నారు. అంతేకాక జీవన్ ఉమంగ్ పేరుతో కొత్తగా పెన్షన్ పాలసీని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఇందులో ప్రీమియం చెల్లించిన వారికి జీవితాంతం 8శాతం సోమ్ముతో పెన్షన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. అంతేకాక 60 సంవత్సరాలు దాటిన వారికి కూడా ప్రధాన మంత్రి వయో వందన పాలసీ పేరుతో వారు చెసిన డిపాజిట్‌లపై 8శాతం సొత్తును నెల నెలా పెన్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుందన్నారు. 8 శాతం అనేది ఏ బ్యాంకు కూడా ఇవ్వడంలేదన్నారు. కరీంనగర్ డివిజన్ విషయానికి వస్తే గత సంవత్సరం 187కోట్ల ప్రీమియం వసూలు చేయాలనేది లక్ష్యంకాగా దానిని అదిగమించి 191 కోట్లను చేరుకున్నామన్నారు. ఈసంవత్సరం 201 కోట్ల ప్రీమియం వసూలు చేయాలనేది లక్ష్యంగా ఉందని ఇందులో ఇప్పటికే 70 కోట్లను వసూలు చేశామన్నారు. దేశం మొత్తం విూద 2 కోట్ల 1 లక్షల పాలసీ దారుల క్లెయింలను పరిష్కరించామన్నారు. ఇందులో పాలసీ అయిపోయినవారు, మద్యలో మరణించిన వారున్నారు. వీరికిగాను లక్షా 12వేల కోట్లను చెల్లించడం జరిగిందన్నారు. డివిజన్ లో మొత్తం 700 మందికి 150 కోట్లను చెల్లించడం జరిగిందన్నారు. ప్రపంచంలోనే అన్నిరకాల క్లెయింలను పరిష్కరిస్తూ 99.63శాతం సాదించి ప్రపంచంలోనే ఎల్‌ఐసి అగ్రస్థానంలో ఉందన్నారు. అంతేకాక 2006 సంస్థ గొల్డెన్ సిల్వర్ జూబ్లీ సందర్బంగా 100 కోట్లతో నిధిని ఏర్పాటు చేసి సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో స్వచ్చంద సంస్థలకు చేయూతనివ్వడం, మానసిక వికలాంగులకు, వికలాంగులకు చేయూతనిస్తూనే పాఠశాలలకు ఇన్‌ప్రాస్టక్చ్రర్ కూడా సమకూరుస్తున్నామన్నారు. ఇందులో ఎమర్జెన్సీ సేవలకు వినియోగించే అంబులెన్స్‌లు, వ్యాన్‌లు, పాఠశాలల్లో లైబ్రరీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అంతేకాక 112 డివిజన్లలో ఏటా ఒక్కో డివిజన్‌లో 20 మంది పదోతరగతి పూర్తయిన విద్యార్థులకు 10వేల చోప్పు స్కాలర్ షిప్‌లు ఇస్తున్నామన్నారు. మైక్రోఇన్సూరెన్స్ విషయంలో పాత్రికేయులడిగిన ప్రశ్నకు సమాదానమిస్తూ మంచి ఉద్దేశ్యంతో బడగు బలహీన వర్గాలు ప్రీమియం తక్కువ చెల్లించేస్థాయి వారిని ఉద్దేశించి ఏర్పాటు చేసిన ఈ భీమా పథకం కొందరు వ్యక్తులు సంస్థల నిర్వాకం వల్ల దుర్వినియోగం కావడంతో దానిని ఉపసంహరించుకుందన్నారు. అయితే ఇందులో ఎజెంట్లుగా వ్యవహరించిన స్వచ్చంద సంస్థలు, వివిద సంస్థలు ప్రజలనుంచి వసూలుచేసిన ప్రీమియం చెల్లించిన వారికి ఇప్పటికే పరిహారం చెల్లించడం జరిగిందని, అయితే చిక్కల్లా వసూలు చేసి సంస్థకు చెల్లించని వారి విషయంలో సమస్యగా మారిందన్నారు., దీనిపై డివిజన్‌లో 203 మంది ఉన్నారని వీరికి 9శాతం వడ్డీతో పాటు మూడువేలు అదనంగా చెల్లించాలని ఫోరం తీర్పు నిచ్చిందని, అయితే జోనల్ మొత్తంలో ఈ బాదితులున్నందున పై కార్యాలయం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కరీంనగర్ డివిజన్ పరిధిలో 24 లక్షల పాలసీలున్నాయన్నారు., డివిజన్ పరిధిలో కొత్త 9 జిల్లాలున్నాయన్నారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు సరికోత్త విదానాలను అందిపుచ్చుకుంటూ నిత్య నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోందన్నారు. ఎస్‌ఎంఎస్ ఆదారిత సేవలను, ఆన్‌లైన్ ప్రీమియం చెల్లింపులు, ఈసేవలు, లావాదేవీల సమాచారాన్ని ఎస్‌ఎంఎస్ రూపంలో
అందిస్తున్నామన్నారు. పాలసీదారులకు చెల్లింపులను నెఫ్ట్ ద్వారానే చెల్లిస్తున్నామన్నారు. ఎల్‌ఐసి ఒక్క బారత్‌కే పరిమితంకాకుండా 14 దేశాల్లో విస్తరించిందన్నారు. 2016-17లో సంస్థ 33 అవార్డులను గెలుచుకుందన్నారు. జాతీయ శిక్షణ 2017, బంగారు నెమలి పథకాన్ని, సూపర్ బ్రాండ్ 2016, ఇండియన్ ఇన్సూరెన్స్, దైనిక్ భాస్కర్, గ్రీన్ టెక్ హెచ్‌ఆర్, హిందుస్థాన్ 2017 రీడర్స్ డైజెస్ట్ అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్ బిజినెస్ టుడే ఎంటి ఫైనాన్సియల్ అవార్డులను ఎల్‌ఐసి గెలుచుకుందన్నారునప పాత్రికేయుల సమావేశంలో మార్కెటింగ్ మేనేజర్ అశోక్‌రావు, లీగల్ మేనేజర్ ఎన్ చంద్రశేఖర్, మాడిశెట్టి గోపాల్, తదితరులు పాల్గొన్నారు