వ్య.కా.స నూతన మండల,పట్టణ కమిటీ ఎన్నిక..
చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 20 : తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం చేర్యాల నూతన మండల కమిటీని మహాసభలో ఎన్నిక చేశారు. మంగళవారం ఈమేరకు ఓ ప్రకటనలో తెలిపారు. మండల అధ్యక్షులుగా గుండ్ర రవీందర్, కార్యదర్శిగా గొర్రె శ్రీనివాస్, ఉపాధ్యక్షులు మల్కని ఎల్లయ్య, సహాయ కార్యదర్శి పొన్నబోయిన సిద్ధులు, కమిటీ సభ్యులుగా గర్నపల్లి చంద్రం, తెట్టబాయి జయరాజు, ఎస్.కె ఆదిల్, మడికొండ అశోక్, చెట్టే మల్లయ్య, పండుగ బాలమణి, జీరాల సత్తెమ్మ, ఆలేటి బాలమణి, భీమ శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శిగా తిరిగి ఎన్నికైన గొర్రె శ్రీనివాస్ మాట్లాడుతూ చేర్యాల మండలంలో వ్యవసాయ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ఉపాధి హామీ పనులలో ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం ఉపాధి హామీలో రోజు కూలి 600 రూపాయలకు పెంచే విధంగా ప్రతి కుటుంబానికి రెండు వందల పని దినాలు కల్పించాలని, వ్యవసాయ కార్మికులకు 50 సంవత్సరాలు పైబడిన వ్యవసాయ కార్మికులందరికీ ఆసరా పెన్షన్ ఇవ్వాలని, రేషన్ కార్డులు, అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించుకొనుటకు 5 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం మంజూరు చేయాలని ,కార్మికులకు సమగ్ర చట్టం అమలు కోసం రాబోయే రోజుల్లో పోరాటాలు నిర్వహిస్తామని ఈ పోరాటాలకు వ్యవసాయ కార్మికులు పెద్ద సంఖ్యలో సంఘటితమై కదిలి రావాలని సెప్టెంబర్ 22 న ఈ సమస్యల సాధన కోసం సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు చేపట్టబోయే ధర్నా ను జయప్రదం చేయాలని మండలంలోని ప్రతి గ్రామం నుండి వ్యవసాయ కార్మికులు వందల సంఖ్యలో కలెక్టరేట్కు తరలి రావాలని పిలుపునిచ్చారు.
చేర్యాల పట్టణ వ్యవసాయ కార్మిక సంఘం చేర్యాల పట్టణ అధ్యక్షులుగా సుధబోయిన కనకయ్య, కార్యదర్శిగా బోయిని మల్లేశం, ఉపాధ్యక్షులుగా కాటం రాములు, కమిటీ సభ్యులుగా దునుకల కనకవ్వ, కమలపురం లక్ష్మి ఎన్నిక సంఘం జిల్లా నాయకులు ప్రకటించారు