శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రెడ్‌అలర్ట్
హైదరాబాద్: స్వాంతంత్య్ర దినోత్సవం సమీపిస్తుండటంతో శంషాబాద్ అంతరాజతీయ విమానాశ్రయంలో పోలీసులు రెడ్‌ఆలర్ట్ ప్రకటించారు. నేటి నుంచి నెలరోజుల పాటు ఇవి అమల్లో ఉంటాయి. ఉగ్రవాదులు దేశంలోని నగరాలు, ప్రధాన విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకోవచ్చని నిఘావర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు. సందర్శకులకు ఇచ్చే పాసులను నిలిపివేశారు. మరోవైపు సీఐఎస్‌ఎఫ్ బలంగాలు ఎయిర్‌పోర్టులో తనిఖీలు చేస్తున్నాయి.