శబరిమలలో తొలగని ఉద్రిక్తత

పోలీసుల సాయంతో ఓ జర్నలిస్ట్‌,మరో ఇద్దరు మహిళల సాహసం
స్వామిని దర్శించుకోకుండా అడ్డుకున్న భక్తులు
ఆచారాలను పాటించకుంటే ఆలయాన్ని మూసేయాలన్న రాజకుటుంబం
మళ్లీ సంప్రోక్షణ తరవాతే తెరవాలని ఆదేశాలు
తిరువనంతపురం,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): శబరిమల ఆలయం వద్ద వరుసగా శుక్రవరాం కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడికి చేరుకోవాలన్న పట్టుదలతో వెళ్లిన ఇద్దరు మహిళలను పంబవద్దే భక్తులు అడ్డుకున్నారు. వారు హెల్మెట్లు, జాకెట్లు ధరించి పోలీసుల సాయంతో వచ్చినా ముందుకు వెళ్లకుండా చేశారు. దీంతో వారు సన్నిధానం చేరకుండానే వెనుదిరిగారు. ఇదిలావుంటే మహిళలను అనుమతించాలన్న వివాదంపై కేరళకు చెందిన పండలమ్‌ ప్యాలస్‌ ట్రస్ట్‌ శుక్రవారం స్పందించింది. ఈ మేరకు శబరిమల దేవస్థానానికి ఓ లేఖ కూడా రాసింది. ఏవైనా ఆచారాలను ఉల్లంఘించే ప్రయత్నాలు జరిగితే వెంటనే గుడిని మూసేయాలని ఆ రాజ కుటుంబం స్పష్టంచేసింది. దేవస్థానం ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌, అడ్మినిస్టేట్రివ్‌ వ్‌ ఆఫీసర్‌లకు ఈ లేఖ రాసింది. ఆచారాల ఉల్లంఘన జరిగినట్లయితే ప్రధాన పూజారి పూర్తిగా సంప్రోక్షణ చేసిన తర్వాతే మళ్లీ ఆలయాన్ని తెరవాలని ఆ లేఖలో ట్రస్ట్‌ కోరింది. అయ్యప్ప స్వామితో ఈ పండలమ్‌ రాజ కుటుంబానికి ఎన్నో శతాబ్దాల అనుబంధం ఉంది. ఈ కుటుంబం అన్ని
వయసుల మహిళలను ఆలయంలోకి అనుమతించాలన్న తీర్పును వ్యతిరేకించింది. అదే జరిగితే ఆ అయ్యప్ప భక్తులను శపిస్తాడని ఈ కుటుంబం చెబుతున్నది. అక్టోబర్‌ 12న సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసన కూడా వ్యక్తంచేసింది. అన్ని వయసుల మహిళలు ఆలయంలోకి వెళ్లడానికి ప్రయత్నించడం, వాళ్లను అడ్డుకోవడానికి నిరసనకారులు యత్నిస్తున్న సమయంలో రాజ కుటుంబం నుంచి ఈ కీలకమైన లేఖ రావడం గమనార్హం. ఇప్పటికే ఆలయ ప్రధాన పూజారి కూడా మహిళల ప్రవేశాన్ని నిరిసిస్తూ ఆలయానికి తాళం వేసి వెళ్లిపోతానని హెచ్చరించారు. మరోవైపు
శుక్రవారం పాత్రికేయురాలు కవితా జక్కల్‌, రీహనా ఫాతిమా, మేరీ స్వీటీ ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. కానీ ఆందోళనకారులు ఒత్తిడి కారణంగా వాళ్లు వెనుదిరిగారు.
గర్భగుడిలోకి వెళ్లే 18 మెట్ల దారి సవిూపం వరకు పాత్రికేయురాలు కవితా పోలీసుల సహాయంతో వెళ్లారు. కానీ అక్కడ నుంచి ముందుకు వెళ్లలేకపోవడంతో వెనుదిరిగారు. దీనిపై ఆమె విూడియాతో మాట్లాడారు. మాకు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చినందుకు మేం చాలా గర్వపడుతున్నాం. మేము ఎంతటి కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చిందో విూరందరూ చూసే ఉంటారని ఆమె అన్నారు.