శబరిమలలో ప్రత్యేక వసతుల కల్పనకు కృషి

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):శబరిమల అయ్యప్పస్వామి వారి సన్నిధిలో తెలంగాణ భక్తులకు ప్రత్యేక వసతుల కల్పనకు కృషి  చేస్తామని అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు రాజ్ దేశ్ పాండే అన్నారు.ఆదివారం స్థానిక అయ్యప్పస్వామి దేవాలయంలో జరిగిన ఆ సంఘ ఆత్మీయ సమ్మేళనంలో  ఆయన పాల్గొని మాట్లాడారు.హిందూ ధర్మాన్ని కాపాడేందుకు హిందువుగా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.హిందూ ధర్మాన్ని కాపాడుకోవటం మనందరి బాధ్యత అని  అన్నారు.ఎక్కడ అయ్యప్ప స్వాములు అధికంగా మాలలు వేసి భక్తి భావంతో ఉంటారో ఆ ప్రాంతం  ఆధ్యాత్మికతను సంతరించుకుంటుందన్నారు.ఒక ఇంట్లో ఒక భక్తుడు మాలను ధరిస్తే ఆ కుటుంబానికి  ఏడు తరాల పుణ్యం కలుగుతుందని పేర్కొన్నారు.అయ్యప్ప సన్నిధికి చేరినప్పుడు  అక్కడ సేవా కార్యక్రమాల్లో పాల్గొని తమ భక్తిని చాటుకోవాలన్నారు.ప్రతి నెల అయ్యప్ప స్వామి దేవాలయంలో  పడి పూజను కచ్చితంగా నిర్వహించాలన్నారు.అనంతరం అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి జిల్లా, పట్టణ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్, అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి  రాష్ట్ర అధ్యక్షులు ఓరుగంటి వెంకటేశ్వర్లు , రాష్ట్ర ఉపాధ్యక్షులు గొట్టెముక్కల శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు అర్వపల్లి సత్యనారాయణ, మారం సాయి వెంకటేశ్వర్లు  , వీరబ్రహ్మాచారి,పట్టణ గౌరవ అధ్యక్షులు రాచకొండ దేవయ్య, పట్టణ అధ్యక్షులు క్రిష్ణ , మిర్యాల సంపత్  తదితరులు పాల్గొన్నారు.
Attachments area