శశి కపూర్‌కు దాదాసాహెబ్‌ పాల్కే అవార్డు

03 03

ముంబై మే 4 (జనంసాక్షి):

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు శశికపూర్‌కు దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రదానం చేశారు.ఆదివారం పశ్చిమ ముంబైలోని ఫృధీ

¸యేటర్‌లోజరిగిన ప్రత్యేక కార్యక్రమంలో శశికపూర్‌కు అరుణ్‌ జైట్లీ అందజేశారు. ఈ కార్యక్రమానికి శశికపూర్‌ కుటుంబ సభ్యులతో పాటు

బాలీవుడ్‌ ప్రముఖ నటీనటులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.2013 ఏడాదికిగాను కేంద్ర

ప్రభుత్వం శశికపూర్‌కు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే శశికపూర్‌ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాను పురస్కారం అందుకోవడానికి న్యూఢిల్లీ రాలేనని ఆయన కేంద్ర ప్రభుత్వానికి తెలిపారు. దాంతో ఆదివారం కేంద్రమంత్రి అరుణ్‌ జైట్లీ చేతుల విూదగా శశికపూర్‌ దాదా ఫాల్కే పురస్కారం అందుకున్నారు. 2011లో శశికపూర్‌కు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్‌ పురస్కారంతో సత్కరించిన విషయం విదితమే.