శాంతియుత నిరసన తెలిపిన వీఆర్ఏ సంఘం…
పలు డిమాండ్ల గురించి డిప్యూటీ తాసిల్దార్ కు వినతి పత్రం ఇచ్చిన విఆర్ఏలు….
వెంకటాపూర్(రామప్ప),జూన్30(జనం సాక్షి):-
తెలంగాణ రాష్ట్ర వీఆర్ఏ –జేఏసి పిలుపు మేరకు 30 జూన్ 2022 రోజున వెంకటాపూర్ మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు శాంతియుత నిరసన చేయడమైనది.2020 సెప్టెంబర్ 9 న అసెంబ్లీ లో నూతన రెవిన్యూ చట్టం తెస్తున్న సందర్భంగా వీఆర్ఏ లందరికి పే –స్కేల్ ఇస్తామని, 55 సంవత్సరాలు వయసు పై బడిన వారసులకు ఉద్యోగాలు ఇస్తామని నిండు శాసన సభలో స్వయానా ముఖ్యమంత్రి ప్రకటించారు.ప్రకటించిన ఈ హామీ అమలు చేస్తారని,ప్రభుత్వ ఉద్యోగులు గా గుర్తింపు వస్తుందని,ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్లుగా అన్ని సౌకర్యాలు వస్తాయని ఆశించి,గత 20 నెలలుగా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం.వీఆర్ఏ లకు పే –స్కేల్, వారసులకు ఉద్యోగాలు ఇవ్వకుండా అర్హత కలిగిన వారికి పదోన్నతులు కల్పించకుండా రెవిన్యూ అధికారులు,ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది.
వీఆర్ఏ మండలాధ్యక్షులు పొనగంటి శంకర్ మాట్లాడుతూ వీఆర్ఏ ల సమస్యలు పరిష్కారం చేయాలని,అందరు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన విధంగా కనీసం 30% పిఆర్సి కూడా అమలు చేయలేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2020 సెప్టెంబర్ 9 న అసెంబ్లీ లో నూతన రెవిన్యూ చట్టం తెస్తున్న సందర్భంగా వీఆర్ఏ లందరికి పే –స్కేల్ ఇస్తామని, 55 సం.లు వయసు పై బడిన వారసులకు ఉద్యోగాలు ఇస్తామని నిండు శాసన సభలో స్వయానా ముఖ్యమంత్రి ప్రకటించారు.కానీ నేటికి కూడా అట్టి హామీ అమలు కాలేదు,కేవలం 10500/- గౌరవ వేతనంతో కుటుంబాలు గడవక చాలా ఇబ్బంది పడుతున్నాం కావున ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే ముఖ్యమంత్రి ప్రకటించిన ఈ హామీ అమలు చేయాలని డిప్యూటీ తహసీల్దారు కి వెంకటాపూర్ మండల వీఆర్ఏ లందరూ వినతి పత్రం సమర్పించినారు.లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని,నిరవధిక సమ్మె చేయడానికైనా వెనకాడబోమని ప్రభుత్వాన్ని కోరినారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పొనగంటి శంకర్,ఉపాధ్యక్షులు కాసర్ల రాజు ,స్వప్న ,సునిత,సరిత,శశి,శ్రీనాథ్ మరియు మండల వీఆర్ఏ లందరూ పాల్గొనడం జరిగింది.
డిమాండ్స్
1,ముఖ్యమంత్రి అసెంబ్లీ లో ప్రకటించిన ప్రకారం పే –స్కేల్ జీఓ ను వెంటనే విడుదల చేయాలి.
2,అర్హత కలిగిన వీఆర్ఏ లకు ప్రమోషన్లు ఇవ్వాలి.
3,55 సం.లు వయసు పై బడిన వీఆర్ఏ ల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి.వారికి పెన్షన్ సౌకర్యం కల్పించాలనీ
గ్రామ రెవెన్యూ సహాయకులసంఘం నుంచి తెలిపారు.