శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు…

ఎస్సై కోగిల తిరుపతి

 

కేసముద్రం-అక్టోబర్ 10-జనం సాక్షి : వాట్సప్ గ్రూపుల ద్వారా వ్యక్తిగత దూషణలు చేసుకొని పార్టీలపరంగా గొడవలకు దారి తీసే పోస్టులు పెట్టి శాంతిభద్రతలకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని కేసముద్రం ఎస్సై కొగిల తిరుపతి అన్నారు.ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మతపరమైన రాజకీయ ఘర్షణలకు దారి తీసే పుకార్లు,వ్యక్తిగత దూషణలు,రెచ్చగొట్టే పోస్టులు వ్యాప్తి చేయడానికి వాట్సప్ గ్రూపులను దుర్వినియోగం చేయొద్దని హెచ్చరించారు.వాట్సాప్ గ్రూపులు,సోషల్ మీడియా లపై పోలీసులు నిఘా పెట్టారని తెలిపారు.తమ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులను అనుమతించే ముందు వాటి ప్రామాణికత, చట్టబద్ధతను ధ్రువీకరించాలని గ్రూప్ అడ్మిన్ లకు సలహా ఇచ్చారు.చట్ట విరుద్ధమైన,అభ్యంతరకర పోస్టుల కు గ్రూప్ అడ్మిన్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు.గతంలో వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు,దురుద్దేశ పూరిత సమాచారాన్ని ప్రచారం చేసిన వారిపై కేసులు నమోదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.ప్రజల శాంతి భద్రతలకు భరోసా కల్పించడమే పోలీసుల బాధ్యత అని ఎస్సై తిరుపతి తెలియజేశారు.