శాశ్వత సందర్శనకు చావెజ్ పార్థీవదేహం
కరకస్ : అనారోగ్యంతో కమ్నూమూసిన వెనెజువెలా అధ్యక్షుడు హ్యూగో చావెజ్ అంత్యక్రియలను నేడు అధికారికంగా నిర్వహించనున్నారు. అంత్యక్రియల అనంతరం ఆయన పార్థివదేహాన్ని ప్రజల శాశ్వత సందర్శన కోసం మిలటరీ మ్యూజియంలో గాజుపెట్టేలో భద్రపరచనున్నట్లు తాత్కాలిక అధ్యక్షుడు వికోలన్ మాడ్యురో వెల్లడించారు. కమ్యూనిస్టు నేతలు లెనిన్, మావోల మాదిరిగానే ప్రజలు చావెజ్‌ను ఎప్పటీకి చూసుకోవచ్చని తెలిపారు. మరోవైపు తమ అభిమాన నేతను కడసారి చూసేందుకు భారీగా ప్రజలు తరలివస్తున్నారు. అయన పార్థీవదేహానికి కారకస్‌లో పలువురు దేశాధినేతలు శ్రద్ధాంజలి ఘటించారు. నేడు జరిగే అంత్యక్రియల్లో సుమారు 22 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు.భారత్ నుంచి కేంద్ర మంత్రి సచిన్ పైలట్ ఈ కార్యక్రమానికి హాజరువుతున్నారు.