శాసనసభ్యులు రేగా కు అఖిలపక్ష నేతలు వినతి పత్రం అందజేత.

ముంపు గ్రామాలకు ఆర్ఆర్ ప్యాకేజీ అందించాలని వినతి.

– మండల కేంద్రంలో 15వ రోజు కొనసాగుతున్న దీక్ష.

బూర్గంపహాడ్ సెప్టెంబర్02 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో రిలే నిరాహార దీక్షలు 15వ రోజుకు చేరాయి. ఈ కార్యక్రమంలో భాగంగా మండలంలోని గోదావరి వరద గ్రామాలకు పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ తో పాటు కరకట్టనిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, శాసనసభ్యులు, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు కు శుక్రవారం మణుగూరు క్యాంప్ కార్యాలయం మండల అఖిలపక్షం నేతలు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన సానుకూలంగా స్పందించి ఈ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. త్వరలో బూర్గంపహాడ్ మండల ముంపు బాధితులకు తగు న్యాయం జరుగుతుందని, ఎవరు అధైర్య పడవద్దని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత, తెరాస మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి, సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, సొసైటీ డైరెక్టర్ బొల్లు రవి, టిడిపి మండల అధ్యక్షులు తాళ్లూరు జగదీశ్వర్ రావు, సిపిఐ నాయకులు పేరాల శ్రీనివాసరావు, బీసీ సంఘం నాయకులు దాసరి సాంబ, బీఎస్పీ జిల్లా నాయకులు, ముంపు గ్రామాల జేఏసీ కన్వీనర్ కేసుపాక రమణ తదితరులు పాల్గొన్నారుు.

15వ రోజు కొనసాగుతున్న దీక్ష.

బూర్గంపహాడ్ మండలంలోని గోదావరి వరద బాధిత గ్రామాలను పోలవరం ముంపు గ్రామాలుగా గుర్తించి 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందించాలని లేదా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలని సాగుతున్న నిరవధిక రిలే నిరాహార దీక్షలు నేటికీ 15వ రోజుకు చేరుకున్నాయి. శుక్రవారం దీక్షలో మహిళలు పురుషులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీక్షకు కాంగ్రెస్ పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు. దీక్షలో మాజీ ఎమ్మెల్యే పంజాబిక్షం సతీమణి కుంజ వెంకటరమణ, ఎస్కే గౌసియా, ఎస్.కె రహి మున్నీసా, మహిసాక్షి రామ సీత, కనసాని గోవిందమ్మ, ఎస్.కె నజరీన్, ఎడారి రాంబాబు, తోకల లక్ష్మయ్య, ఆశిక్ లైక్, కేసుపాక రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.