శాస్త్రీయంగా జోన్ల విభజన

ఉద్యోగ, నిరుద్యోగుల్లో సానుకూల స్పందన

ఉద్యోగ నియామకాల్లో చేకూరనున్న ప్రయోజనం

హైదరాబాద్‌,మే25(జ‌నంసాక్షి): తెలంగాణ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే విధంగా జోన్ల వర్గీకరణ సాగిందన్న అభిప్రాయం కిందిస్థాయి ఉద్యోగుల్లో, నిరుద్యోగుల్లోనే వ్యక్తం అవుతోంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం పునరావృతం అయ్యే అవకాశం లేకుండా జోనల్‌, మల్టీ జోనల్‌ వ్యవస్థలను ప్రభుత్వం ఏర్పాటు జరిగిందన్న అభిప్రాయం వస్తోంది. చిన్న జిల్లాలు ఏర్పాటు చేసుకున్నందున ఆయా ప్రాంతాల్లో ఉండే స్థానికులకు ఎక్కువ ప్రయోజనం కలిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, ఆ తర్వాత రాష్ట్రంలో జిల్లాలు పురుడు పోసుకోవడంతో జోన్ల వ్యవస్థను పునర్విభజిం చాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి గతంలోనే ప్రతిపాదనలు పంపగా… ఈ ప్రతిపాదనలపై ఉన్నత స్థాయిలో సవిూక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ జోన్లు, మల్టీ జోన్ల వ్యవస్థపై కులంకశంగా చర్చించారు. వీటితో తెలంగాణ యువతకు, ఉద్యోగార్ధుల స్థానికత ఆధారంగా మేలు చేకూరనున్న నేపథ్యంలో కేసీఆర్‌ ఈ నూతన వ్యవస్థకు ఖరారు చేశారు. సుదీర్ఘ చర్చలు, సవిూక్షలు, పరిశీలనల అనంతరం పలు జోన్ల ఏర్పాటుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు స్పష్టతనిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆరు జోన్లుగా విభజించబడగా… తెలంగాణలో 5, 6 జోన్లు మిగిలాయి. ఇప్పుడా జోన్ల ప్రకారమే ఉద్యోగ నియామాక పక్రియ సాగుతోంది. శాస్త్రీయత ప్రకారం జోన్ల వర్గీకరణ లేకపోవడంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వీటి మార్పులు, చేర్పులపై మొదటి నుంచి ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. కు మొత్తం రాష్ట్రంలో ఏడు జోన్లు ఏర్పాటు అయ్యాయి. ఇందులో రెండు మల్టీ జోన్‌లు సైతం వర్గీకరించారు. కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి, యాదాద్రి, చార్మినార్‌, జోగులాంబ జోన్లుగా విభజించగా ఇందులో రాజన్న జోన్‌లోకి కామారెడ్డి జిల్లా చేరనుంది. రాజన్న జోన్‌లో రాజన్నసిరిసిల్లా జిల్లాతో పాటు కరీంనగర్‌, సిద్దిపేట, కామారెడ్డి, మెదక్‌ జిల్లాలు ఉండబోతున్నాయి. రాజన్న జోన్‌లో మొత్తం ఐదు జిల్లాలను చేర్చగా ఈ జిల్లాల మొత్తం జనాభా 43.09 లక్షల మందిగా ప్రభుత్వం తెలిపింది. చార్మినార్‌ జోన్‌లో అత్యధికంగా 1.03 కోట్ల మంది ఉండగా ఆ తర్వాత భద్రాద్రి జోన్‌లో అరకోటి జనాభా ఉంది. యాదాద్రి 4.23 లక్షలు, జోగులాంబ జోన్‌ 44.63 లక్షల మంది ఉండగా తర్వాతి స్థానంలో రాజన్న జోన్‌ నిలిచింది. జనాభా పరంగా ఏడు జోన్లలో రాజన్న జోన్‌ ఐదో స్థానాన్ని ఆక్రమించింది. ఏడు జోన్లతో పాటు రెండు మల్టీ జోన్లను సైతం ప్రభుత్వం వర్గీకరించగా రాజన్న జోన్‌ కాస్తా కాళేశ్వరం మల్టీ జోన్‌లోకి చేర్చారు.

/ూష్ట్ర ఏర్పాటు నినాదమే నీళ్లు, నియామకాలు, నిధులు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను ఒక్కోటి

ఆచరణలోకి తెస్తోంది. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లో జరుగుతోన్న తేడాలను సరి చేసేందుకు జోన్ల విభజనకు శ్రీకారం చుట్టడం మంచి పరిణామం. దీంతో స్థానికత ఆధారంగా భర్తీ పక్రియ జరుగుతోంది. తద్వారా మెరుగైన అవకాశాలు స్థానికులకే లభించే వీలు దొరుకుతుంది. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. జోన్ల విభజనను త్వరగా కార్యాచరణలోకి తీసుకు వస్తే మంచిదని అంటున్నారు.