శిక్షణ తరగతులతో జర్నలిస్ట్ లలో నైపుణ్యం..
———- Forwarded message ———
From: A Ankush <[email protected]>
Date: Fri, Jul 15, 2022 at 2:42 PM
Subject: సిద్దిపేట అర్బన్
To: <[email protected]>
From: A Ankush <[email protected]>
Date: Fri, Jul 15, 2022 at 2:42 PM
Subject: సిద్దిపేట అర్బన్
To: <[email protected]>
శిక్షణ తరగతులతో జర్నలిస్ట్ లలో నైపుణ్యం..
ఫోటో : సమావేశంలో మాట్లాడుతున్న దళిత జర్నలిస్టు వెల్ఫేర్ సొసైటీ సభ్యులు..
సిద్దిపేట అర్బన్, జూలై 15( జనం సాక్షి):
శిక్షణ తరగతులు నిర్వహించడం ద్వారా జర్నలిస్టులలో నైపుణ్యం మెరుగుపడుతుందని దళిత జర్నలిస్టు వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు రాజలింగం అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం నాయకులు మాట్లాడారు. ఈనెల 16, 17 తేదీలలో జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులకు సిద్దిపేట ఐఎంఏ హాల్లో సొసైటీ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ శిక్షణ తరగతుల్లో మల్లెపల్లి లక్ష్మయ్య, గంట చక్రపాణి, రిటైర్డ్ ఇంజనీర్ శ్యాంసుందర్లు జర్నలిస్టులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే ఈ శిక్షణ ముగింపు కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొంటారని అన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని దళిత వర్కింగ్ జర్నలిస్టులు అందరూ వినియోగించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో సొసైటీ గౌరవ అధ్యక్షులు బబ్బురి రాజు, ప్రధాన కార్యదర్శి జనార్ధన్, నాయకులు చంద్రం, అరుణ్, రాజబాబు, నరసింహులు, చందు, పలువురు పాల్గొన్నారు.