శిక్షణ పూర్తి చేసుకున్న గిరిజన యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు.ఐ టి డి ఏ. పిఓ.అంకిత్

ఏటూరునాగారం(జనంసాక్షి)జులై26.
సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఏటూరునాగారం ఆధ్వర్యంలో వివిధ యూత్ ట్రైనింగ్ సెంటర్ల ద్వారా గిరిజన నిరుద్యోగ యువతీ యువకులకు నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ మరియు ఉపాధి అవకాశాలలో భాగంగా యూత్ ట్రైనింగ్ సెంటర్ మహబూబాబాద్ నందు నిర్వహించిన 3 రకాల కోర్సులలో భాగంగా 30 మంది హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ శిక్షణను పూర్తి చేసుకున్నటువంటి అభ్యర్థులకు,
క్రీమ్ స్టోన్ మరియు కిన్నెర గ్రాండ్ హైదరాబాదు నందు 12500/-, పి ఎఫ్,ఇ ఎస్ ఐ మరియు అకామిడేషన్ సదుపాయాలతో వివిధ స్టార్ హోటల్స్ నందు ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగింది.
దీనిలో భాగంగా ఈరోజు అనగా 26.07.2023 నాడు ఉదయం 11.00 గంటల నుండి 11:45 నిమిషాల వరకు అంకిత్, ఐఏఎస్ ప్రాజెక్ట్ అధికారి ఎటునాగారం శిక్షణను పూర్తి చేసుకుని ఉపాధిలో ఉన్నటువంటి అభ్యర్థులతో వెబ్ మీటింగ్ ద్వారా వారితో మాట్లాడటం జరిగింది.
ఈ యొక్క మీటింగ్ లో అభ్యర్థులతో వారు పొందినటువంటి ఉపాధి గురించి వారి యొక్క వేతన వివరాలు గురించి, వసతి సదుపాయాల గురించి అభ్యర్థులను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఉపాధి పొందిన వారిని క్రమం తప్పకుండా మానిటరింగ్ చేయాలని సూచించడం జరిగింది.
ఈ యొక్క కార్యక్రమంలో
జె వసంతరావు, ఏపీవో, ఐటీడీఏ ఎటునాగారం,
ఎం కొండలరావు,జేడీఎం ఐటిడిఏ ఎటునాగారం,పి సుధాకర్, చైర్మన్,లైఫ్ ఫౌండేషన్ హైదరాబాద్ పాల్గొనడం జరిగింది.

తాజావార్తలు