శిక్షనుంచి తప్పించుకునే యత్నం

తాను నంపుసంకుడిగా చెప్పుకున్న డేరాబాబా

చండీగఢ్‌,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): అత్యాచార కేసులో 20 ఏళ్ల కారాగారశిక్షకు గురైన డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్‌ సింగ్‌ విచారణలో షాకింగ్‌ విషయాలు వెల్లడించాడు. శిక్ష నుంచి తప్పించుకునేందుకు తానో నపుంసకుడినని చెప్పుకొన్నాడు. 1990 నుంచి తాను నపుంసకుడిగా మారానని, 1999లో తాను ఇద్దరు సాధ్విలను అత్యాచారం చేశానన్న ఆరోపణలు అవాస్తవమని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో వెల్లడించాడు. ఈ నేపథ్యంలో తనపై ఉన్న కేసులు కొట్టివేయాల్సిందిగా గుర్మీత్‌ సీబీఐ న్యాయమూర్తి జగ్‌దీప్‌ సింగ్‌ను వేడుకొన్నాడు. అయితే గుర్మీత్‌ చెప్పేవన్నీ అబద్ధాలేనని సీబీఐ కొట్టిపారేసింది. అదీకాకుండా గుర్మీత్‌ కేసులో బాధితురాలు అతని గురించి షాకింగ్‌ విషయాలు చెప్పారు. తమ పట్ల జరిగిన దారుణం గురించి తన సోదరుడికి చెబుతానంటే గుర్మీత్‌ బెదిరించాడని తెలిపింది. ఈ విషయాలు

చెబితే తన సోదరుడిని పిలిపించి అక్కడికక్కడే చంపి పాతేస్తానన్నాడని న్యాయస్థానానికి వెల్లడించింది. గుర్మీత్‌కి ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నట్లు పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదునే పరిగణలోకి తీసుకుని గుర్మీత్‌కి శిక్ష వేసినట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు.