శిథిలావస్థకు చేరిన గాంధీనగర్ పాఠశాల
ఖమ్మం, జూలై 30 : ఖమ్మం జిల్లాలో పారిశ్రామిక ప్రాంతమైన సారపాకలోని గాంధీనగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది. ఈ పాఠశాలలో ఒకటి నుంచి 5 తరగతుల వరకు సుమారు 70 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ పాఠశాల భవనం పైకప్పు పెచ్చులూడుతుండడంతో విద్యార్థులు తరగతి గదిలోకి ప్రవేశించడానికి భయపడుతున్నారు. దీంతో ఉపాధ్యాయులు తరగతి గదులను మూసివేశారు. ఆ తరగతి విద్యార్థులు పాఠశాల వరండాలోనే విద్యను అభ్యసిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు అదనపు తరగతి గదిని నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.