శివసేన దుశ్చర్య

1

– కులకర్ణి ముఖానికి నల్ల రంగు

– శివసేన చర్యను ఖండించిన అద్వానీ

ముంబై,అక్టోబర్‌12(జనంసాక్షి):

పాకిస్థాన్‌ మాజీ మంత్రి పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించొద్దని నిరసన వ్యక్తం చేస్తూ ఓఆర్‌ఎఫ్‌ చైర్మన్‌ సుధీంద్ర కులకర్ణిపై శివసేన కార్యకర్తలు ఇంకు దాడి చేసారు. దీంతో ఆయన ఇంకు పూసిన ముఖంతోనే కార్యాక్రమాన్ని నిర్వహించి శివసేనకు గట్టి జవాబి/-చారు.   పాకిస్థాన్‌ విదేశీ విధానంపై ఆ దేశ మాజీ మంత్రి రాసిన పుస్తకం ‘నెయిదర్‌ ఎ హాక్‌ నార్‌ ఎ డవ్‌- యాన్‌ ఇన్‌సైడర్స్‌ అకౌంట్‌ ఆఫ్‌ పాకిస్థాన్స్‌ ఫారెన్‌ పాలసీ’ ఆవిష్కరణ కార్యక్రమం రద్దుచేసే ప్రసక్తే లేదని అబ్జర్వర్‌ అండ్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ సుధీంద్ర కులకర్ణి అన్నారు. పాకిస్థాన్‌ మాజీ మంత్రి ఖుర్షిద్‌ మహ్మద్‌ కసూరి రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమం సోమవారం ముంబయిలో నిర్వహించారు. అయితే.. ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాలంటూ శివసేన పార్టీ నాయకులు డిమాండ్‌ చేసారు. అంతేకాకుండా ఈ కార్యక్రమ నిర్వాహకుడు సుధీంద్ర కులకర్ణి ముఖంపై నలుపు రంగు పోసి కార్యక్రమాన్ని రద్దు చేయాల్సిందిగా హెచ్చరించారు. ఈ సందర్భంగా సుధీంద్ర కులకర్ణి విలేకరులతో మాట్లాడుతూ ..  శివసేన నాయకులు తన ఇంటి వద్ద తనపై దాడి చేశారని.. రంగులు పోశారని చెప్పారు. అయినప్పటికీ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని రద్దు చేసే ప్రసక్తి లేదని.. కచ్చితంగా కొనసాగిస్తామని ఆయన చెప్పారు. మరోవైపు ఈ వివాదంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడణవీస్‌ స్పందించారు. కసూరి పుస్తకావిష్కరణ కార్యక్రమానికి భద్రత కల్పించామని ఆయన హావిూ ఇచ్చారు.  కులకర్ణిపై ఇంకు దాడిని బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ ఖండించారు. ఇంకు దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. ఇలాంటి ఘటనలతో దేశానికి చెడ్డ పేరు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో భిన్నమైన అభిప్రాయాలకు అవకాశం ఉండాలి. ఒకరినొకరు పరస్పరం గౌరవించుకోవాలని సూచించారు. ముంబయిలో  శివసేన కార్యకర్తలు సుధీంద్ర కులకర్ణికి నల్లరంగు పూయడాన్ని కేంద్ర ¬ంశాఖ సహాయ మంత్రి కిరణ్‌ రిజిజు తీవ్రంగా ఖండించారు. ప్రతి ఒక్కరికీ నిరసన తెలిపే హక్కు ఉంటుంది కానీ.. భౌతికంగా దాడికి దిగడం తప్పు అన్నారు. ఇలా దాడి చేసి నల్లరంగు పూయడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు.  కార్యక్రమం నిర్వహించవద్దని డిమాండ్‌చేస్తున్న శివసేన కార్యకర్తలు కార్యక్రమ నిర్వాహకుడు సుధీంద్ర కులకర్ణిపై దాడిచేసి ముఖమంతా నల్లరంగు పూసిన సంగతి తెలిసిందే. పుస్తకావిష్కరణ కార్యక్రమం రద్దు చేయాలని శివసేన పార్టీ నాయకులు డిమాండ్‌ చేశారు. కార్యక్రమ నిర్వాహకుడు సుధీంద్ర కులకర్ణి ముఖంపై నలుపు రంగు పోసి కార్యక్రమాన్ని రద్దు చేయాల్సిందిగా హెచ్చరించారు. కానీ కులకర్ణి పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని రద్దు చేసే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు.   ఈ ఘటన చోటుచేసుకున్న కొద్ది గంటలకే శివసేన కార్యకర్తలు పుణెలో మరో వ్యక్తిని బెదిరించారు.  కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త, యువ వ్యాపారవేత్త తెహసీన్‌ పూనావాలా పుణెలో పాకిస్థాన్‌ ఫడ్‌ ఫెస్టివల్‌ నిర్వహించ తలపెట్టారు. ఆ కార్యక్రమాన్ని నిర్వహించొద్దంటూ ఫేస్‌బుక్‌ ద్వారా ఆయనకు బెదిరింపు సందేశం వచ్చింది. శివసేన పుణె అధ్యక్షుడు అజయ్‌ భోంస్లే  సోదరుడు అమర్‌ భోంస్లే ఫేస్‌బుక్‌ ఖాతా పేరిట ఈ మెసేజీ వచ్చిందని బాధితుడు తెలిపారు. ¬టళ్లు, పబ్‌లకు వెళ్లినప్పుడు కూడా జాతీయ జెండాను చొక్కాకు పెట్టుకోవడంపై గతంలోనూ పూనావాలాను శివసేన కార్యకర్తలు బెదిరించారు.