శునకం.. విశ్వాస నేస్తం
డోర్నకల్ జూలై 6 (జనం సాక్షి)
మనిషికి అత్యంత విశ్వాసపాత్ర మైన జీవి శునకం మాత్రమేనని మండలం పశువైద్యాధికారి డాక్టర్ వి.సురేష్ కుమార్ తెలిపారు.బుధవారం వరల్డ్ జూనోసిస్ డే పురస్కరించుకొని డోర్నకల్, ములకలపల్లి ప్రాథమిక పశు వైద్య శాలలో ఆయన పాల్గొన్నారు.శునకాలకు ఉచిత యాంటీ రేబీస్ టీకాల శిబిరాన్ని ప్రారంభించారు.శునకాల పెంపకంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై యజమానులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేబీస్ వ్యాధి సోకకుండా వ్యాక్సిన్‌లు ఇప్పించాలని సూచించారు.కార్యక్రమంలో సిబ్బంది, పెంపకదారులు పాల్గొన్నారు.
Attachments area