శుభవార్త అందుకోబోతున్న శ్రీశాంత్
వివాదాలు, కేసులతో సతమతమవుతున్న భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్ శుభవార్త అందుకోబోతున్నాడు. త్వరలో అతడు తండ్రి కాబోతున్నాడు. ఈ వార్తను శ్రీశాంత్ ఇటీవల ధ్రువీకరించాడు. అతడి భార్య భువనేశ్వరి కుమారి ప్రస్తుతం గర్భవతిగా ఉంది. ఆమె మే నెల చివరి వారంలో ప్రసవించే అవకాశముందని వైద్యులు తెలిపారని శ్రీశాంత్ సోదరుడు దిపుశాంత్ కూడా వెల్లడించారు.తన స్నేహితురాలైన భువనేశ్వరిని 2013, డిసెంబర్ 12న శ్రీశాంత్ వివాహమాడాడు. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో శ్రీశాంత్ జైలుకు వెళ్లివచ్చినా భువనేశ్వరి అతడినే పెళ్లాడింది.