శేషాచలం ఎదురుకాల్పులపై రాజ్యసభలో కలకలం

7
సిబిఐ విచారణ జరపలేం..

¬ం మంత్రి రాజ్‌నాథ్‌

న్యూఢిల్లీ,ఏప్రిల్‌30(జనంసాక్షి):

శేషాచలం ఎదురుకాల్పులపై రాజ్యసభలో కలకలం రేగింది. ¬ం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ గురువారం  రాజ్య సభలో మాట్లాడుతూ… రాష్ట్రం నుంచి ఎలాంటి ప్రతిపాద న లేనందున కేంద్ర దర్యాప్తునకు ఆదేశించ లేమన్నారు. ఎదురుకాల్పులపై సుప్రీం కోర్టు మార్గదర్శకాలు ఉన్నా యని, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించిందని ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్‌ 7న మధ్యాహ్నం 12.30గంటలకు చంద్రగిరి పోలీస్‌స్టేషన్‌లో ఈ విషయంపై కేసు నమోదైందని రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. శేషాచలం ఎదురుకాల్పులపై ఈరోజు రాజ్యసభలో చర్చ జరిగింది. శేషాచలం ఎదురుకాల్పులు హేయమైన చర్యగా సిపిఐనేత డి.రాజా అభివర్ణించారు. ఎర్రచందనం స్మగ్లర్లు కూలీలను పావులుగా వాడుకుంటున్నారని ఆయన అన్నారు. ఇది ఎన్‌కౌంటర్‌ కాదని పచ్చి హత్య అని అన్నారు. కోల్డ్‌ బ్లడెడ్‌ మర్డర్‌ అని అన్నారు. కావాలనే వీరిని చంపారన్నారు. ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారని పోలీసులు చెబుతున్నారని, ఘటన జరిగిన తీరు అనుమానాస్పదంగా ఉందని డిఎంకె సభ్యురాలు కనిమొళి అన్నారు. దుంగలు మోసుకెళ్లే కూలీల వద్ద ఆయుధాలు   ఉంటాయా అని కనిమొళి ప్రశ్నించారు. ఏ పాపం ఎరుగని వారిని కాల్చి చంపారని దీనిపై విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. చనిపోయిన వారంతా అమాయకులని అన్నారు.  ఎర్రచందనం అక్రమ రవాణా బాగా వేళ్లూనుకుందని, ఎర్రచందనం అక్రమ రవాణాలో బడాబాబులను పట్టుకోవాలని జైరాం రమేశ్‌ కోరారు. దీనివెనక ఎవరి హస్తం ఉందో తెలుసుకోవాలని అన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా పెద్ద మాఫియా అని, అక్రమ రవాణాతో వచ్చిన డబ్బులను రాజకీయాల్లో వాడుతున్నారని టిడిపి ఎంపి సీఎం రమేశ్‌ అన్నారు. ఇప్పటికే నాలుగువేల మందిని అరెస్ట్‌ చేశారని, టన్నుల కొద్దీ దుంగలను స్వాధీనం చేసుకున్నారని అన్నారు. కేసులు పెట్టారన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌పై విమర్శలు తగవన్నారు.