శ్రీనగర్‌లో విదేశీ పర్యాటకురాలి మృతుదేహం లభ్యం

శ్రీనగర్‌, జనంసాక్షి: శ్రీనగర్‌లో ఓ విదేశీ పర్యాటకురాలి శవం లభ్యమైంది. ప్రముఖ పర్యాటక స్థలం హౌజ్‌బోటులో బ్రిటన్‌కు చెందిన ఓ యువతి శవాన్ని కనుగొన్నారు. ఆమెను హత్య చేశాడనే ఆరోపణపై డచ్‌ ప్రియుణ్ని పోలిసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. హౌజ్‌బోటులో ఉన్న గదిలో యువతి ఉండగా ఆమెను లైంగికంగా వేధించి హత్యచేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.