శ్రీరాంసాగర్‌కు కొనసాగుతున్న వరదనీరు

నిజామాబాద్‌,జూన్‌12(జ‌నం సాక్షి ): జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ)కు వరద ప్రవాహం కొనసాగుతుంది. ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది. బాబ్లీ ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి దిగువకు 20 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన విషయం విదితమే. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు ఇన్‌ఎ/-లో 20,200ల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 1052.80 అడుగులు కాగా, పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు. మహారాష్ట్ర, కర్ణాటకలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో.. దిగువన ఉన్న తెలంగాణలోని పలు ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో రాష్ట్ర రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తుంది.