శ్రీరామ నవమికి ప్రత్యేక బస్సులు
వైరారోడ్డు(ఖమ్మం): భద్రాచలంలో జరగనున్న శ్రీరామ నవమి ఉత్సవాలకు 360 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) పురుషోత్తం తెలిపారు. ఆయన ఈ విషయమై ఖమ్మంలో తూర్పుగోదావరి, పశ్చిమగోదారి, వరంగల్, ఖమ్మం, గుంటూరు, కృష్ణా జిల్లాల ఆర్టీసీ అధికారులతో సోమవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఖమ్మం సమీపంలోని జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ఈడీ తెలిపారు.