శ్రీరామ నవమికి 602 ఆర్టీసీ బస్సులు

భద్రాచలంపట్టణం, జనంసాక్షి: భద్రాచలంలో ఈనెల 19.20న జరిగే శ్రీరామ నవమి, స్వామివారి పట్టాభిషేకానికి ఆర్టీసీ తరపున ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు భద్రాచలం డిపో మేనేజరు జె. వెంకటేశ్వరబాబు తెలిపారు. కృష్టా రీజియన్‌ (157). పశ్చిమ గోదావరి (160). తూర్పుగోదావరి (72). వరంగల్‌ (10). నల్గొండ (10). కరీంనగర్‌ (10) బస్సులను భద్రాచలానికి ఏర్పాటు చేశామన్నారు. మిగిలిన 185 బస్సులసంఖ్య ఖమ్మం జిల్లాలోని ఆరు డిపోల నుంచి కేటాయించినట్లు తెలిపారు. భద్రాచలం నుంచి పర్ణశాలకు ప్రతి నిమిషాలకు ఒక బస్సు ఏర్పాటు చేశామన్నారు.