శ్రీలంక జైళ్లో దొమ్నీ : 27 మంది మృతి
కొలంబో : శ్రీలంక రాజధాని కొలంబోలోని ఒక కారాగారంలో సంభవించిన భారీ దొమ్నీలో కనీసం 27 మంది ఖైదీలు మరణించారు. మరో 42 మంది గాయపడ్డారని పోలీసులు శనివారం తెలిపారు. పారిపోయిన ఏడుగురు ఖైదీలను అరెస్టు చేసినట్లు చెప్పారు. కారాగారంలో మాదక ద్రవ్యాల కోసం పోలీస్ విభాగానికి చెందిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ వెదకులాట ప్రారంభించారు. అయితే వారి కార్యకలాపాన్ని ఖైదీలు వ్యతిరేకించడంతో దొమీశ్ర్రీన ప్రారంభమైంది. దొమ్నీకి దారి తీసిన సంఘటనలపై త్రిసభ్య కమిటీ విచారణ జరుపుతుందని కారాగారాల శాఖా మంత్రి చంద్రసిరి గజధీర చెప్పారు. దొమ్నీలో సిబ్బంది సహా 50 మందికిపైగా ప్రజలు గాయపడ్డారు. సైన్యానికి చెందిన కమాండో ట్రూపులను రంగంలోకి దించిన అనంతరం పరిస్థితి అదుపులోకి వచ్చింది. దొమ్నీ జరుగుతుండగా కారాగారం నుంచి ఎలాగోలా తప్పించుకున్న ఏడుగురు ఖైదీలను అరెస్టు చ్ణేససినట్లు పోలీసులు తెలిపారు.