శ్రీలంక దాడుల్లో 290కి చేరిన మృతుల సంఖ్య
వివిధ ఆస్పత్రుల్లో మరో 500 మంది క్షతగాత్రులు
దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు
ఇప్పటి వరకు 24మంది అనుమానితుల అరెస్ట్
కొలంబో,ఏప్రిల్22(జనంసాక్షి): శ్రీలంకలో ఆదివారం జరిగిన వరుస పేలుళ్లపై ఆ దేశ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. మూడు ¬టళ్లు, మూడు చర్చిలతో సహ మొత్తం 8 ప్రాంతాల్లో జరిగిన పేలుళ్లలో సుమారు 300 మంది వరకు మరణించారు. అయితే ప్రభుత్వ విశ్లేషణా విభాగం ఆ పేలుళ్లకు సంబంధించి ఓ కొత్త విషయాన్ని వెల్లడించింది. మొత్తం 8 పేలుళ్లలో.. ఆరు పేలుళ్లు ఆత్మాహుతి దాడి వల్ల జరిగినవే అని తేల్చారు. షాంగ్రిలా, కింగ్స్‌బరీ, సినామోన్ గ్రాండ్ ¬టల్స్ వద్ద జరిగిన పేలుళ్లను సూసైడ్ బాంబింగ్‌గా నిర్దారించారు. సెయింట్ ఆంధోనీస్ చర్చి, సెయింట్ సెబాస్టియన్ చర్చి, జియోన్ చర్చిల వద్ద జరిగిన పేలుళ్లను కూడా ఆత్మాహుతి దాడులుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మొత్తం ఏడు మంది సూసైబ్ బాంబర్లు ఈ పేలుళ్లకు పాల్పడినట్లు తెలుస్తోందని ప్రభుత్వ నిఘా వర్గాలు తేల్చాయి. శ్రీలంకలో ఉగ్రవాదులు ఈస్టర్ వేడుకలను టా/-గ్గం/ట్ చేశారు. ఆ పేలుళ్లలో మరణించినవారి సంఖ్య 290కి చేరుకున్నది. 500 మంది గాయపడ్డారు. 24 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
సోమవారం ఉదయానికి ఈ సంఖ్య 290కి చేరినట్లు అధికారులు వెల్లడించారు. మరో 500 మందికిపైగా ఇంకా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ఈ దాడులతో సంబంధం ఉన్న మొత్తం 24 మంది నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు భద్రతా కారhttp://JanamSakshi.org/imgs/2019/04/srilanka.jpgణాల దృష్ట్యా ఆదివారం దేశవ్యాప్తంగా విధించిన నిరవధిక కర్ఫ్వూను ఎత్తివేస్తున్నట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. శ్రీలంక ఎయిర్‌పోర్టు ప్రాంతంలో అమర్చిన ఓ పైపు బాంబును తాజాగా భద్రతా సిబ్బంది కనుగొని నిర్వీర్యం చేశారు. పేలుళ్ల ధాటికి మరణించిన వారిలో ఆరుగురు భారతీయులు ఉన్నారు. విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో పాటు శ్రీలంకలోని భారత హై కమిషన్, కేరళ సీఎం పినరయి విజయన్ ఈ విషయం వెల్లడించారు. ఆదివారం సాయంత్రానికి రమేశ్, లక్ష్మి, నారాయణ్ చంద్రశేఖర్, రెజీనా అనే నలుగురు భారతీయులు మృతి చెందారని ప్రకటించగా.. తాజాగా కేజీ హనుమంతరాయప్ప, ఎమ్ రంగప్ప అనే ఇద్దరు వ్యక్తులు కూడా మరణించినట్లు తెలిపారు. మొత్తం ఈ ఘటనలో 32 మంది విదేశీయులు మృతి చెందినట్లు సమాచారం.
అదే చివరి సెల్ఫీ
విహారయాత్ర నిమిత్తం శ్రీలంక వెళ్లిన ఓ కుటుంబం తీసుకున్న చివరి సెల్ఫీ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బ్రిటన్‌లో స్థిరపడిన ఓ భారతీయ కుటుంబం విహారయాత్ర నిమిత్తం శ్రీలంక వెళ్లింది. రాజధాని కొలంబోలోని ఓ ్గ/వ్‌స్టార్ ¬టల్‌లో భోజనం చేయడానికి వెళ్లారు. ఆ సమయంలో కుటుంబమంతా కలిసి సెల్ఫీ దిగింది. సెల్ఫీని ఫొటోలో ఉన్న యువతి ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన కొద్ది నిమిషాల్లోనే పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆ యువతి మరణించింది. అయితే ఆమె కుటుంబీకులు ప్రాణాలతో ఉన్నారా? లేరా? అన్నది తెలియరాలేదు. ఈస్టర్ సందర్భంగా ఎంతోమంది సరదాగా ¬టళ్లకు వెళ్లి ఎంజాయ్ చేయాలనుకున్నారు. అదే అదనుగా చూసి దాదాపు ఆరుగురు సూసైడ్ బాంబర్లు పేలుళ్లకు పాల్పడ్డారు. 2009 తర్వాత శ్రీలంకలో ఇంతటి దారుణమైన దాడులు జరగడం ఇదే తొలిసారని పోలీసు అధికారులు అంటున్నారు.