శ్రీవారికి భక్తుల కాసుల వర్షం

21 రోజుల్లోనే వందకోట్లు దాటిన ఆదాయం

తిరుమల,జూలై23(జనంసాక్షి): కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. రోజురోజుకు భక్తుల సంఖ్య పెరుగుతోంది. వివిధ రాష్టాల్ర నుంచి భక్తులు తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకుని తమకు నచ్చిన కానుకలను సమర్పించి మొక్కులు చెల్లించుకుం టున్నారు. శ్రీవారి ఆలయానికి భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో హుండీ ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. దీంతో శ్రీవారికి కానుకల వర్షం కురుస్తోంది. రికార్డు స్థాయిలో శ్రీవారికి భక్తులు కానుకలు సమర్పిస్తున్నారు. ఇప్పటికే ఈ మాసంలో నాలుగు సార్లు రూ.5 కోట్లకు పైగా కానుకలు వచ్చాయి. ఈ నెలలో 21 రోజులకే రూ.100 కోట్ల 75లక్షల ఆదాయం వచ్చింది. టీటీడీ(ªుఆ) చరిత్రలోనే ఈ నెలలో అత్యధిక ఆదాయం వచ్చే అవకాశం ఉందని టీటీడీ భావిస్తోంది. మరోవైపు ఈరోజు ఆగస్ట్‌ నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను టీటీడీ విడుదల చేసింది. ఈరోజు వెయ్యి టోకెన్లను జారీ చేసింది. అలాగే రేపటి నుంచి ఈనెల 26 వరకూ శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు జరగనున్నాయి.