శ్రీవారిని దర్శించుకున్న పెద్దపల్లి ఎమ్మెల్యే

తిరుమల,సెప్టెంబర్‌2 జనం సాక్షి : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పెద్దపల్లి  ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి  దర్శించుకున్నారు. శనివారం ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న ఆయన శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం నాగసాయి మండపంలో ఎమ్మెల్యే
కుటుంబ సభ్యులకు ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందించి, వేదాశీర్వచనం అందజేశారు. ఆలయం వెలుపల ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌  ముఖ్యమంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయాలని, బీఆర్‌ఎస్‌ దేశవ్యాప్తంగా ప్రభావం చూపాలని వేడుకున్నట్లు చెప్పారు. పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలను చల్లంగా చూడాలని, సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని మొక్కుకున్నట్లు తెలిపారు.