శ్రీశైలం,సాగర్‌లకు వరద ప్రవాహం
కర్నూలుఏ,జూలై16(జనం సాక్షి ): ఎగువనుంచి వరద రావడంతో శ్రీశైలం,సాగర్ ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. జూరాల నుంచి 1.47 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, సుంకేశుల నుంచి 1.59 లక్షల క్యూసెక్కుల ప్రవాహం శ్రీశైలానికి వచ్చిచేరుతున్నది. దీంతో జలాశయం నీటిమట్టం 840.1 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. శ్రీశైలం గరిష్ట నీటినిల్వ 215.8 టీఎంసీలు. ఇప్పుడు 61.92 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ప్రాజెక్టులోకి వరద వస్తుండంతో ఎడగట్టు విద్యుత్ కేంద్రంలో కరెంటు ఉత్పత్తి కొనసాగుతున్నది. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 31,784 క్యూసెక్కుల నీరు విడుదలవుతున్నది. ఈ క్రమంలో నాగార్జునసాగర్ కు ప్రాజెక్ట్‌కు కూడా వరద ప్రవాహం ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ప్లో 12,714 క్యూసెక్కులు, అవుట్ ఎª`లో 7,987 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా… ప్రస్తుత నీటిమట్టం 529.30 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలకు గాను… ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 166.7838 టీఎంసీలకు చేరింది.