శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో శరన్నవరాత్రి పూజలు.

మూడవరోజు గాయత్రి మాత అమ్మవారిగా దర్శనం.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్29(జనంసాక్షి):

 

శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో మూడవరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు.జిల్లా కేంద్రంలోని కొల్లాపూర్ చౌరస్తాకు దగ్గరలో ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో అమ్మవారి అలంకరణలో భక్తులకు దర్శన మిచ్చారని ఆలయ ప్రధాన అర్చకులు పెంటమరాజు నవీన్ తెలిపారు.ఆలయంలో బుధవారం గాయత్రి దేవి అలంకరణ తో పాటు ప్రత్యేకంగా గాయత్రి హోమాన్ని తాళ్ల యాదగిరి జ్యోతి దంపతులచే వేద బ్రాహ్మణులు తిరునగర్ పవన్ శర్మచే వేదమంత్రచరణల మధ్య నిర్వహించారు. గాయత్రి హోమం నిర్వాణతో సకల అభిష్టాలు నెరవేర్తాయని త్రికాల సంధ్య పాటించే బ్రాహ్మణులను పూజించడం ఎంతో శుభదాయకం అని అన్నారు. దుర్గామాత పూజా కార్యక్రమంలో భాగంగా గణపతి ఆరాధన,నవగ్రహ పూజ, అష్టదిక్పాలకుల పూజ, లక్ష్మీ గణపతికి ప్రత్యేకంగా హావిషులను ఇచ్చారు. మహిళలచే సామూహికంగా కుంకుమార్చన పుష్పార్చన లలిత సహస్రనామ పారాయణ పట్టణం ఆలయంలో అమ్మవారిని పల్లకి సేవ పలు కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు . అనంతరం అమ్మవారికి నక్షత్ర హారతి, కుంభ హారతి ,కర్పూర హారతులను , ప్రత్యేక ప్రసాదాలను నివేదన చేశారు. భక్తులకు సామూహికంగా వేద ఆశీర్వాదం తీర్థ ప్రసాదాల పంపిణీ చేశారు . అనంతరం సామూహిక భోజనాలు చేశారు. ప్రత్యేకంగా చిన్నారులకు అక్షరాభ్యాసాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి ఎలిమే ఈశ్వరయ్య, పూజారులు నవీన్ పవన్ కుమార్ శర్మ, సిబ్బంది భూపాల్ రెడ్డి దామోదర్, నాగర్ కర్నూల్ మేరు సంఘం అధ్యక్షులు తాళ్ల నిరంజన్ సభ్యులు బోనగిరి పాండురంగయ్య, విజయ,పద్మ, ఆశ్రమ విద్యార్థులు భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.