శ్రీ భద్రకాళి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 26(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని చారిత్రక శ్రీ భద్రకాళి దేవాలయంలో శ్రీ భద్రకాళి శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ నగరం మేయర్ గుండు సుధారాణి, కూడా చైర్మన్ సుందర్ రాజన్ యాదవ్ లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సోమవారం నుండి వచ్చే నెల ఆరో తారీకు వరకు ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అన్నారు సోమవారం అమ్మవారిని శైలపుత్రీ క్రమం బాల త్రిపుర సుందరి అలంకారంలో అలంకరించారు ఈనెల 27న అన్నపూర్ణ అలంకారం, 28న గాయత్రి అలంకారం, 29న శ్రీ మహాలక్ష్మి అలంకారం, 30న రాజరాజేశ్వరి అలంకారం, అక్టోబర్ 1న భవాని అలంకారం, 2న సరస్వతి అలంకారము 3న భద్రకాళీ మహా దుర్గా అలంకారం, 4న మహిషాసుర మర్దిని అలంకారము, 5న హంస వాహన తెప్పోత్సవం, 6న శ్రీ భద్రకాళీ భద్రేశ్వరుల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో శేషు భారతి తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శేషు భారతి, ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు, ఆలయ సూపరింటెండెంట్ విజయ్ తో పాటు సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
Attachments area