శ్రీ లలిత త్రిపురసుందరి అలంకరణ లో అమ్మవారు
పినపాక నియోజకవర్గం సెప్టెంబర్ (జనం సాక్షి): శ్రీశ్రీశ్రీ పంచముఖ వేద గాయత్రి మాత ఆలయంలో అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాల్గవ రోజు శ్రీ లలిత త్రిపురసుందరి అమ్మవారి అలంకరణ లో గురువారం భక్తులకు దర్శనమిచ్చారు.పూజ కార్యక్రమం లో డా, కామారపు శశిధర్ దంపతులు, సానంగుల నాగేంద్ర దంపతుల చేతుల మీదుగా అమ్మవారికి పుష్పార్చన కుంకుమార్చనలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలా త్రిపుర సుందరి అనగా మనసు, బుద్ది, చిత్తం దేవి ఆధీనంలో ఉంటాయి. అభయహస్త ముద్రలో ఉండే తల్లి అనుగ్రహం కోసం ఉపాసకులు బాలార్చన చేస్తారు. ఈ రోజు రెండు నుండి పదేళ్ల లోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి కొత్త బట్టలు పెడతారు.ఇలా చేయటం వల్ల పిల్లల్లో జ్ఞాన సంపద పెరుగుతుందని ఆలయ అర్చకులు ప్రదీప్ శాస్త్రి భక్తులకు వివరించారు. అనంతరం తీర్థ ప్రసాదములు అందజేసారు.ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త దయానిధి అక్కినేపల్లి వసంతాచార్యులు ఆలయ అర్చకులు అక్కినేపల్లి ప్రదీప్ శాస్త్రి, దోసపాటి వెంకటేశ్వర్లు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.