షరతులు ఆమోదిస్తే..
– విద్యార్థులతో ముఖాముఖిలో రాహుల్
ముంబై,జనవరి16(జనంసాక్షి): తమ పార్టీ డిమాండ్లను ఒప్పుకుంటే.. 15 నిమిషాల్లో వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ) బిల్లును రాజ్యసభలో ఆమోదిస్తామని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. తమ డిమాండ్లను ఒప్పుకుంటే.. బిల్లు ఆమోదం పొందడానికి పావుగంట సమయం చాలన్నారు. ముంబయిలోని నర్సీ మాంఝీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ సైన్స్ విద్యార్థులతో రాహుల్‌గాంధీ ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. ప్రధాని మోదీ ప్రారంభించనున్న అంకుర్ భారత్‌పై కూడా ఆయన విమర్శలు చేశారు. అసహసం, స్టార్టప్ ఒకే చోట ఉండలేవన్నారు. పరిశ్రమలు పెట్టాలంటే.. స్వేచ్ఛ కావాలని.. అయితే ప్రస్తుత ప్రభుత్వంతో అది సాధ్యం కాదన్నారు. స్టార్ట్ అప్ ప్రాజెక్టుకు,అసహనం సమస్యకు లింకు పెట్టి మాట్లాడారు. ముంబైలో మేనేజ్ మెంట్ విద్యార్దలుతో జరిపిన ప్రత్యేక సమావేశంలో ఆయన ప్రసంగించారు.స్టార్ట్ అప్ లకు తాను అనుకూలమని, కాని అవి అబివృద్ది చెందడానికి స్వేచ్చ ఉండాలని, అలాగే వారి భావాలకు విలువ ఉండాలని ఆయన అన్నారు. కాని ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం సంకుచితమైనదని ఆయన అభిప్రాయ పడ్డారు.అందువల్ల ఆర్‌ఎస్ ఎస్ భావజాలానికి, స్టార్ట్ అప్ ల భావజాలానికి అంతరం ఉందని ఆయన విశ్లేషించారు.స్టార్ట్ అప్ లు అబివృద్ది చెందాలంటే మౌలికంగా ప్లెక్సిబిలిటి ఉండాలని, ఆర్‌ఎస్‌ఎస్ లో ఆ గుణం లేదని ఆయన అన్నారు.మోడీ తనకు స్టార్ట్ అప్ కావాలి.. అలాగే అసహనంగా ఉంటానంటే కుదరదని, ఇది వైరుధ్యభరితమని ఆయన అన్నారు.ప్రజల మద్య బిజెపి చీలిక తెస్తోందని రాహుల్ విమర్శించారు.మోదీ ప్రభుత్వం ముస్లింలను, హిందువులను, మహిళలను వేరుగా చూస్తుందని ఎద్దేవా చేశారు. పఠాన్‌కోట దాడులపై విచారణను కేంద్రం…. జాతీయ భద్రతా సలహాదారుల చేతుల్లో పెట్టిందని.. అది సరైన నిర్ణయం కాదని పేర్కొన్నారు.