షర్మిల పాదయాత్రను నిరసిస్తూ నల్లజెండాలతో ఆందోళన
మహబూబ్‌నగర్: పాలమూరు జిల్లాలో షర్మిల పాదయాత్రకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించిన తర్వాతే పాదయాత్ర చేయాలని తెలంగాణవాదులు డిమాండ్ చేస్తున్నారు. షర్మిల యాత్రను నిరసిస్తూ ఇవాళ పాలమూరు వర్సిటీ విద్యార్థులు నల్లజెండాలతో ఆందోళనకు దిగారు. జిల్లా కేంద్రానికి షర్మిల పాదయాత్ర ఇవాళ చేరుకోనుంది. దీంతో పాలమూరు వర్సీటీ ఎదుట పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. పోలీసులను భారీగా మోహరించారు.