షాక్ తిన్నాం – ఐవీఆర్ సీ ఎల్..

పశ్చిమ బెంగాల్ : కోల్ కతాలో నిర్మాణంలో ఉన్న కొద్దిభాగం ఫ్లై ఓవర్ కూలిపోవడంపై షాక్ తిన్నామని దీన్ని నిర్మాణం చేపడుతున్న ఐవీఆర్ సీఎల్ కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. గురువారం సాయంత్రం ఉత్తర ప్రాంతంలోని గిరీష్ పార్కు సమీపంలోని బర్రా బజార్ లో నిర్మాణంలో ఉన్న వివేకానంద ఫ్లై ఓవర్ కుప్పకూలింది. ఈ ఘటనలో 21 మంది దుర్మరణం పాలయ్యారు. అనేక మందికి గాయాలయ్యాయి. ఈ ఫ్లై ఓవర్ ను ఐవీఆర్ సీ ఎల్ కంపెనీ చేపడుతోంది. ఈ ఘటనపై ఐవీఆర్ సీ ఎల్ కంపెనీ ప్రతినిధులు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. నగరంలోని బంజారాహిల్స్ లో ఉన్న కార్యాలయంలో ఈ విలేకరుల సమావేశం జరిగింది. తాము 27 సంవత్సరాలుగా ఈ నిర్మాణ రంగంలో ఉన్నామని తెలిపారు. 2009 నుంచి ఈ ఫ్లైఓవర్‌ పనులు జరుగుతున్నాయని కంపెనీ హెచ్‌ఆర్‌ ఆపరేషన్స్‌ పాండురంగారావు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే తమ టెక్నికల్‌ టీం వెంటనే కోల్‌కతకు బయలుదేరిందని తెలిపారు. ఎక్కడా డిజైన్ లో లోపాలు లేవని స్పష్టం చేశారు. ప్రమాదం విషయం తెలుసుకుని తాము షాక్ తిన్నామని, ఘటనపై ప్రభుత్వానికి సహకరిస్తున్నామని తెలిపారు. ఈ కంపెనీలో ఆరు వేల మంది పని చేయడం జరుగుతోందన్నారు. కంపెనీపై దుష్ర్పచారం సాగుతోందని, మీడియా కూడా ఒక్కటి చెబితే ఒకటు రాస్తోందని అసహనం వ్యక్తం చేశారు.
మరోవైపు వంతెన కూలిపోవడానికి గల కారణాలపై కోల్ కతా ప్రభుత్వాధికారులు అన్వేషణలు మొదలు పెట్టారు. నగరంలోని బంజారాహిల్స్ లో ఉన్న కంపెనీ కార్యాలయానికి కోల్ కతా నుండి రెండు బృందాలు వస్తున్నట్లు సమాచారం. నిర్మాణంలో ఉపయోగించిన నిర్మాణ సామాగ్రీని అధికారుల ఎదుట పెడుతామని కంపెనీ యాజమాన్యం పేర్కొంటోంది. ఇందులో ఎవరి వైఫల్యం ఉందో రానున్న రో