షా చాణక్యానికి పరీక్ష కానున్న అసెంబ్లీ ఎన్నికలు

న్యూఢిల్లీ,మార్చి31(జ‌నంసాక్షి): త్వరలో జరుగనున్న వివిధరాష్టాల్ర అసెంబ్లీ ఎన్నికలు మరోమారు బిజెపికి పరీక్ష పెట్టబోతున్నాయి. ఢిల్లీ, బీహార్‌ల ఓటమి తరవాత బిజెపి పెద్దగా ప్రజలను ఆకట్టుకునే విధంగా ప్రజల్లోకి వెల్లలేకపోయింది. ఈ దశలో గెలుపే లక్ష్యంగా భారీ వ్యూహ రచనతో ముందుకు పోతోంది.   అలాగే బిజెపి కూటమిని నిలువరించేందుకు కూడా నితీష్‌ ఎత్తులు వేస్తున్నారు. అయితే ఢిల్లీ,బీహార్‌ ఎన్నికల పరాభవంతో బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా ఎలాంటి వ్యూహాలు రచిస్తారన్నది ఇప్పుడు ప్రధానం కానుంది. తమ తరవాతి లక్ష్యం దక్షిణాది అని బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా చేసిన ప్రకటనకు అనుగుణంగానే ఆయన పర్యటనలు, కార్యక్రమాలు ఉంటున్నాయి.  ఆ తదుపరి పశ్చిమబంగ అన్నారు. అయితే అంతకుముందే ఢిల్లీలో కోలుకోలేని విధంగా దెబ్బతిన్నారు. ఇటీవల వివిధ రాష్టాల్ల్రో అపజయం తరవాత షా అంచనాలు తలకిందులయ్యాయి. అందుకే ఇప్పుడు షా  వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అలాగే పశ్చిమబంగలోనూ షా పావులు కదుపుతున్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై  బురుద్వాన్‌ పేలుడు, శారదా కుంభకోణం కేసుల బురదను అంటించి లబ్ది పొందాలని చూస్తున్నారు. సరిహద్దు రాష్ట్రమైన బంగాల్‌కు బంగ్లాదేశ్‌ నుంచి వలసలు ఓ సమస్య. జాతీయ భద్రతను పట్టించుకోకుండా ఓటు బ్యాంకు రాజకీయాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టికేంద్రీకరించింది. బంగ్లాదేశ్‌ నుంచి వలసలను అనుమతిస్తోంది’ అని పేర్కొన్న షా  మమతా బెనర్జీ ఎన్ని ఇబ్బందులు సృష్టించినా బంగాల్‌లో భాజపా బలపడుతుందని చెప్పుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లా ఒప్పంద కారణంగా ఇక్కడ వసలదారులకు వెసలుబాటు కలుగనుంది.  ఇక్కడి బిజెపి శ్రేణులకు ఈ చర్య ఉపకరించేదిగా ఉంది.అంతేగాకుండా బంగ్లా సరిహద్దులనుమూసేస్తామని అన్నారు.   అంతేగాకుండా మమతకు చెందిన నేతలను మెల్లగా బిజెపిలోకి లాగతున్నారు.  తనవరకైతే రాజకీయాలకన్నా దేశమే ఎక్కువని అంటున్నారు. పలువురు పార్టీ నేతలు భాజపాతో సంప్రదింపుల్లో ఉన్నట్లు తృణమూల్‌ వర్గాల సమాచారం.మొత్తానికి పశ్చిమబంగాలో పార్టీకి పునాదులు వేసే పనిలో షా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. అటు పశ్చిమబంగ, తమిళనాడు, కేరళ ఎన్నికలు  ఇప్పుడు షా చాణక్యానికి పరీక్ష కాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో అయినా ప్రభీవం చూపుతారా అన్నది చూడాలి.