షూటింగ్‌ వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఇండియాకు గోల్డ్‌ మెడల్‌

న్యూఢిల్లీ,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ వరల్డ్‌కప్‌ ఫైనల్‌ను ఇండియా గ్రాండ్‌గా మొదలుపెట్టింది. 10 విూటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించారు జీతూ రాయ్‌, హీనా సిద్దు. క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో 800కుగాను 767 పాయింట్స్‌తో తొలి స్థానంలో నిలిచి ఇండియా ్గ/నైల్‌కు క్వాల్గి/ అయింది. అక్కడ గోల్డ్‌ కోసం ఫ్రాన్స్‌తో ్గ/ట్‌ చేసింది. చైనా బ్రాంజ్‌ మెడల్‌తో సరిపెట్టుకుంది. ్గ/నైల్లో భారత జోడీ 483.4 పాయింట్లు స్కోర్‌ చేసింది. రెండోస్థానంలో నిలిచిన ఫ్రాన్స్‌ జోడీ గోబెర్‌విలె, ఫౌక్వెట్‌ 481.1 పాయింట్లు, చైనా జోడీ కాయ్‌, యాంగ్‌ 418.2 పాయింట్లు సాధించారు.

మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో జీతూ, హీనా జోడీకి ఇది మూడో గోల్డ్‌ మెడల్‌ కావడం విశేషం. తొలిసారి భారత్‌ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో జీతూ, హీనా జోడీ శుభారంభాన్ని ఇచ్చారు. కామన్వెల్త్‌, ఏషియన్‌ గేమ్స్‌లో గోల్డ్‌ మెడల్స్‌ సాధించిన జీతూ రాయ్‌.. ఈ టోర్నీలో 10 విూటర్‌ ఫ్రీ పిస్టల్‌, 50 విూటర్ల పిస్టల్‌ ఈవెంట్లలోనూ పాల్గొననున్నాడు. మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌ కూడా తొలిసారి ప్రయోగాత్మకంగా వరల్డ్‌కప్స్‌లో ప్రవేశపెట్టగా.. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేయనుంది.