షెడ్యుల్‌ కంటే ముందుగా టెస్త్‌ ఫలితాలు

హైదరాబాద్‌, జనంసాక్షి: లక్షల మంది విద్యార్ధులు ఎదురుచూస్తున్న పదో తరగతి ఫలితాలు ఈ నెల 17న విడుదలకానున్నాయి. మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్ధసారధి ఫలితాలను ఆరోజు ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 9 వరకు జరిగిన పదో తరగతి పదో తరగతి పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 12లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు. షెడ్యుల్‌  కంటే ముందుగానే ఫలితాలు ప్రకటిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గ్రేడ్ల వారీగా ఫలితాలను విడుదల చేస్తామని చెప్పారు. రీకౌంటింగ్‌తో పాటు రీవెరిఫికేషన్‌కు కూడా అవకాశం కల్పించనున్నారు.